girl child sale continues in tribal areas of tandur

Si chases in cine fakki to save girl child human trafficking

sale of girl child continues in tribal areas of rangareddy district, in the latest incident basheerabad si Abhinava Chaturvedi chases and saves a girl child human trafficking bindovers accused in front of tahashildar.

sale of girl child continues in tribal areas of rangareddy district, in the latest incident basheerabad si Abhinava Chaturvedi chases and saves a girl child human trafficking bindovers accused in front of tahashildar.

పెళ్లి పేరుతో యువతుల అక్రమరవాణా.. అడ్డుకట్ట వేసిన అభినవుడు..

Posted: 02/18/2016 12:59 PM IST
Si chases in cine fakki to save girl child human trafficking

పోలీసు ఉద్యోగం అందులోనూ బాథ్యతాయుతమైన అధికారి స్థానంలో వుంటే వారికి నిద్రాహారాలు వుండవన్నది జగమెరిగిన సత్యం. అర్థరాత్రి వరకు పెట్రోలింగ్ చేసి ఆ తరువాత నిద్రకు ఉపక్రమించిన ఎస్ ఐ.. ఇంకా నిద్రలో వుండగానే తెల్లవారు జామున 6 గంటలకు ఒక ఫోన్ కాల్ రాగానే.. తరువాత చూద్దమని అనకుండా హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లారు బషీరాబాద్ ఎస్‌ఐ అభినవ చతుర్వేది. రంగారెడ్డి జిల్లా తాండాలలో ఆడశిశువుల అమ్మకాలు అప్పడప్పుడు జరుగుతాయని తెలిసిన ఎస్ ఐ కి..  ఓ మైనర్ బాలికను పెళ్లి పేరుతో గుజరాత్‌కు తరలిస్తున్నారని.. ఫోన్ రాగానే ఈజీగా తీసుకోలేదు. వెంటనే రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఆయన చేజింగ్ చేసి మరీ అక్రమరవాణా అటకట్టించారు.

వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలం వాల్యానాయక్ తండాకు చెందిన శాంతిబాయి, చౌహాన్ సూర్యానాయక్ దంపతులకు ఆరుగురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. నాలుగో కుమార్తె చౌహాన్ విజ్జిబాయి(16)ని గుజరాత్‌లో ఉన్న వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తే రెండు లక్షల రూపాయలు ఇప్పిస్తానని మద్యవర్తిగా వ్యవహరించిన అదే తండా వాసి మణిబాయి విజ్జి తల్లికి చెప్పిగా అందుకు అంగీకరించిన శాంతిబాయి కొంతడబ్బును కూడా తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న జెండర్ టీం సభ్యురాలు హీరిబాయి ఇటీవల ఆ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి, వారు చేసేది చట్టరిత్యా నేరమని, తప్పక శిక్షపడుతుందని హెచ్చరించింది. బాలికకు పెళ్లి చేయబోమని వారి నుంచి లిఖితపూర్వకంగా హామీ కూడా తీసుకుంది.  

మధ్యవర్తి హీరాబాయి రంగంలోకి దిగి.. గుజరాత్‌లో డబ్బు తీసుకున్నానని, పెళ్లి చేయకపోతే జరిమానా చెల్లించాలి.. లేదంటే విజ్జిబాయిని తనతో పంపించాలని మణిబాయి ఒత్తిడి తెచ్చింది. విధిలేని పరిస్థితుల్లో తమ కూతురును మణిబాయితో పంపించేందుకు ఆ దంపతులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కూతురును బషీరాబాద్‌కు తీసుకొచ్చి మణిబాయికి అప్పగించారు. వీరంతా నవాంద్గి రైల్వేస్టేషన్‌లో ప్యాసింజర్ రైలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న జెండర్ టీం సభ్యులు హీరాబాయి, మంతన్ గౌడ్, అదే తండాకు చెందిన ఆశ వర్కర్ మున్నీబాయి రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. ఆ వెంటనే బషీరాబాద్ ఎస్సై అభినవ చతుర్వేదికి ఫోన్‌చేసి విషయం చెప్పారు.


ఎస్ ఐ రాకుండానే రైలు కదిలి వెళ్లింది.  అంతలోనే రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఎస్సైకి  హీరిబాయి రైలు వెళ్లి పోయిందని  చెప్పింది. దీంతో ఎస్సై తన వాహనంలో 25 నిమిషాల వ్యవధిలో తాండూరుకు చేరుకున్నారు.  రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైల్లోకి పరుగెత్తి ఎక్కారు. చైన్‌లాగి నిలిపివేశారు. బాలిక తల్లిదండ్రులు, మధ్యవర్తి ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. ఎస్‌ఐ వారిని తన వాహనంలోనే బషీరాబాద్ ఠాణాకు తీసుకొచ్చారు. కేసు నమోదు చేస్తే తమ పరువుపోతుందని వారు వేడుకున్నారు. తాము చేసింది తప్పేనని.. ఇక పునరావృతం కానివ్వబోమని వేడుకున్నారు. దీంతో ఎస్‌ఐ బాలిక తల్లిదండ్రులతోపాటు మధ్యవర్తిని కూడా తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : human trafficking  Police  SI Abhinava Chaturvedi  Basheerabad  Tandur  RangaReddy  

Other Articles