Balakrishna inviting all for lepakshi ustavam

Balakrishna inviting all for lepakshi ustavam

balakrishna, balakrishna Video, lepakshi, Lepakshi Ustavam, AP, Hindupuram

Balakrishna inviting every body come and participated in the Lepakshi Ustavam 2016. Ap govt officially celebrating Lepakshi Ustavam this year.

లేపాక్షికి ఆహ్వానిస్తున్న బాలకృష్ణ

Posted: 02/20/2016 08:31 AM IST
Balakrishna inviting all for lepakshi ustavam

స్వాగతం…అందరికీ సుస్వాగతం అంటూ హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ లేపాక్షి ఉత్సవాల విశిష్టతను వివరిస్తూ విడుదలచేసిన ప్రోమో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. లేపాక్షి ప్రాశస్త్యం, పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే సంకల్పంతో లేపాక్షి ఉత్సవాలను ఈ నెల 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోందని బాలయ్య వివరించారు. హిందూపురం నియోజకవర్గంలో అద్భుతమయిన ఉత్సవాన్ని తెలుగుపండగలా జరపడానికి అన్ని ఏర్పాట్లుచేశామని బాలకృష్ణ తెలిపారు.

శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి వైభవం, తెలుగుభాష సంస్కృతి,నాగరికతను పెంపొందించేందుకు స్వర్గీయ నందమూరి తారకరామారావు ఇచ్చిన స్ఫూర్తిని పెంపొందింప చేయాలని నిర్ణయించామన్నారు. ఆంధ్రరాష్ట్రంలో తెలుగు వైభవాన్ని బాలయ్య తనదైన శైలిలో విశదీకరించారు. హిందూపురం ఎమ్మెల్యేగా లేపాక్షి ఉత్సవాలను విజయవంతంచేయడానికి బాలయ్యబాబు అహర్నిశలు పాటుపడుతున్నారు. అంతా తానై.. అన్నిటా మమేకమై అచ్చ తెలుగులో బాలకృష్ణ రూపొందించిన ఈ ప్రోమో అద్భుతంగా ఉందనే ప్రశంసలు అందుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  balakrishna Video  lepakshi  Lepakshi Ustavam  AP  Hindupuram  

Other Articles