ముఖ్యమంత్రి అంటే డబ్బుకు, డాబుకు ఏమాత్రం తక్కువ ఉండదు. మరి అలాంటి సిఎం గారి జేబులో పైసా లేకుండా పరిస్థితి ఎలా ఉంటుంది. బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ విచిత్రమైన పరిస్థితికి లోనయ్యారు. జేబులో పైసా లేకుండా బస్సు ఎక్కేశారు. తీరా మహిళా కండక్టర్ రూ. 5 టికెట్ చేతిలో పెట్టేటప్పడికి జేబులు తడుముకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రభుత్వాధికారి సీఎం టికెట్ కు 5రూపాయలు చెల్లించాడు. సీఎం గాంధీ మైదాన్ నుంచి పట్నా స్టేషన్ కు ప్రయాణిస్తుండగా ఈ పరిస్థితి ఎదురైంది. ముఖ్యమంత్రి అయినా.. నితిశ్ కుమార్ జేబులో పర్సు కానీ, డబ్బులు కానీ పెట్టుకోరట. సీఎం తో పాటు బస్సులో అర్బన్ డెవలప్ మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమృత్ లాల్ మీనా ప్రయాణిస్తున్నారు. సీఎం పరిస్థితి చూసి టికెట్ కు డబ్బులు చెల్లించారు.
నితిశ్ కుమార్ జేబులో డబ్బులు లేక ఇబ్బందులు పడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పార్టీ సభ్యత్వం రిన్యువల్ చేసుకోడానికి పైసా లేకపోతే జేడీయూ అధికారప్రతినిధి సంజయ్ సింగ్ నితిశ్ రిన్యువల్ ఫీజు చెల్లించాడట. 1985లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఆయన భార్యే ఎన్నికల ఖర్చుకు డబ్బులు ఇచ్చిందట. నితిశ్ కుమార్ ఓ సభలో ఈ విషయాలు చెప్పి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉపకారాన్ని గుర్తు చేసుకున్నారు. మహిళలకోసం ప్రత్యేక బస్సుల్లో మహిళా కండక్టర్లే కాదు, మహిళా డ్రైవర్ లను నియమించాలని రవాణా శాఖను నితిశ్ సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more