the pioneer drags attentions as it publishes bjp high command gives blow to smruthi

Bjp high command gives shock to minister smruti says no melodrama

bjp high command, union hrd minister, smruti irani, amit shah, pm narendra modi, dominating modi, smruti melodrama, rohit vemula, rahul gandhi, aravind kejriwal, sonia gandhi, mayavathi, hcu incident, rohit suicide, smruti in parliament, satya meva jayathe

The national daily the pioneer drags attentions as it publishes bjp high command gives blow to union hrd minister smruthi irani saying no melodrama here after.

ఇక మెలో డ్రామా వద్దు.. స్మృతి ఇరానీకి అధిష్టానం షాక్..

Posted: 02/29/2016 01:47 PM IST
Bjp high command gives shock to minister smruti says no melodrama

పార్లమెంటు శివంగిగా చెలరేగి విపక్షాల నోట మాటను రానీయకుండా చేసిన బీజేపీ మహిళా నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసినదంతా మెలోడ్రామానా..? అంటే అవుననే సమాధానాన్ని వ్యక్తం చేసిందట పార్టీ అధిష్టానం. నమ్మడానికి ఇది కాస్త విడ్డూరంగా వున్న.. స్మృతి ఇరానీ ఇకపై మెలో డ్రామాను ఆపేయండీ.. అంటూ అధిష్టానం ఖచ్చితమైన అదేశాలను జారీ చేసిందట. హైదరాబాదు సెంట్రల్ వర్సిటీలో రిసెర్చీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు ఉరితీతకు నిరసనగా ర్యాలీ, జాతి వ్యతిరేక వ్యాఖ్యలతో నెలకొన్న వివాదంపై  అమె పార్లమెంటులో తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆమె ఓ పాంప్లెట్ ను చేతబట్టుకుని చేసిన ఉద్వేగభరిత ప్రసంగం నరేంద్ర మోదీ సర్కారును ఇరుకున పడేసింది. పార్లమెంటు సమావేశాలను కుదిపేసింది. అయినా వ్మృతి ఇరానీ చేసిన ప్రసంగానికి మంత్రముగ్గుడైన ప్రధాని ఆదే రోజున సాయంత్రం సత్యమేవ జయతే అంటూ ట్విట్ చేసి అమెను అభినందించినా.. అధిష్టానం మాత్రం అమెను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోంది.

స్మృతి ఇరానీ ప్రసంగంపై బీజేపీ అధిష్ఠానం మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాన్నే కాక పార్టీని ఇరుకునపెట్టే ప్రసంగాలు వద్దంటూ అదేశాలు జారీచేసింది.  ఇకపై ఇలాంటి ‘మెలోడ్రామా’ ప్రసంగాలు వద్దంటూ ఆమెకు కాస్తంత గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా ఆయా విషయాలపై సభలో మాట్లాడే ముందు పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించాలని కూడా ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ద పయనీర్’ ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది. కాగా ఒక్క ప్రసంగంతో స్మృతి తన రాజకీయ పరిపక్వతను, పరిజ్ఞానం, దేశభక్తిని దేశ ప్రజలతో పాటు ప్రత్యర్థి పార్టీలకు కూడా చాటినట్లయ్యింది. ఈ నేపథ్యాన్నే కొనసాగించిన పక్షంలో అమె వచ్చే ఎన్నికల నాటికి మోదీని కూడా పక్కన బెట్టి ప్రధాని కాగల టాలెంట్ వుందన్న వాదనలు కూడా తెరపైకి వస్తాయని అధిష్టానం ఇలా చర్యలు తీసుకుంటుందన్న అరోపణలు వినబడుతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp high command  union hrd minister  smruti irani  amit shah  pm narendra modi  

Other Articles