Rohit Sharma misses practice session, likely to miss Sri Lanka match

Injury worries increase as india gear up for sri lanka test

Rohit Sharma, Shikhar Dhawan, India, Asia Cup, Asia Cup 2016, MS Dhoni, cricket news

India opener Rohit Sharma skipper the team's training session on Tuesday in Mirpur and is likely to miss the Asia Cup match against Sri Lanka on Tuesday.

ఆసియా కప్: శ్రీలంకతో మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరం..

Posted: 02/29/2016 09:24 PM IST
Injury worries increase as india gear up for sri lanka test

అత్యద్భుత ఫామ్ లో వుంటూ గత కొంత కాలంగా అటు వన్డేలు, ఇటు టీ 20 మ్యాచ్ లలో బాగా రాణిస్తున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అసియా కప్ లో జరగనున్న మూడవ మ్యాచ్ లో అడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆసియాకప్లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరుగనున్న ట్వంటీ 20 మ్యాచ్ లో ఆయన అడుతారా లేదా..? అన్న స్పష్టత మాత్రం రాకపోయినప్పటికీ.. ఆయన అడకపోవచ్చుననే సంకేతాలు వెలువడుతున్నాయి. పాకిస్తాన్ తో మ్యాచ్ సందర్భంగా కాలిబొటనవేలికి గాయం కావడంతో రోహిత్ కు విశ్రాంతి అనివార్యమైంది.  

దీంతో సోమవారం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్కు హాజరుకాని రోహిత్ కేవలం హోటల్ రూమ్కే పరిమితమయ్యాడు. శనివారం నాటి మ్యాచ్ లో పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ అమిర్ వేసిన బంతి రోహిత్ కాలి బొటనవేలిపై పడింది. అయితే  ఆ తరువాత రోహిత్ వేలికి తీసిన ఎక్స్రేలో పెద్దపాటి గాయం ఏమీ కాలేదని తేలినా.. అతని ఫిట్ నెస్పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు గాయం కారణంగా పాకిస్తాన్ తో మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకున్న శిఖర్ ధావన్ కూడా నామమాత్రంగానే ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit Sharma  Shikhar Dhawan  India  Asia Cup  Asia Cup 2016  MS Dhoni  cricket news  

Other Articles