మాస్కోలోని మెట్రో రైల్వేస్టేషన్ బయట బుర్ఖా ధరించిన ఓ మహిళ భయానక వాతావరణం సృష్టించింది. స్టేషన్ బయట అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను అధికారులు గుర్తింపు పత్రాలు చూపించాలని కోరగా.. బ్యాగ్ నుంచి శిరచ్చేదం చేసిన నాలుగేండ్ల బాలిక తలను బయటకు తీసింది. శక్తిమంతమైన పేలుడు పదార్థాలతో స్టేషన్‌ను పేల్చివేస్తానని బెదిరింపులకు పాల్పడింది. దాంతో అప్రమత్తమైన భద్రతాసిబ్బంది మాస్కో మెట్రోను అర్ధాంతరంగా మూసివేశారు. ఆ తర్వాత సోదాలు నిర్వహించారు. ఆమె బ్యాగ్‌లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకొన్నారు.
ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. అల్లాహో అక్బర్, నేను ఉగ్రవాదిని అంటూ రోడ్డుపై పదేపదే నినాదాలు చేసినట్టు రష్యా టుడే కథనంలో పేర్కొన్నది. రష్యా ఇంటీరియర్ మంత్రిత్వశాఖ ఈ సంఘటన వాస్తవమేనని ధ్రువీకరించింది. శిశు సంరక్షణ కేంద్రాన్ని నడిపే ఆ యువతిని ఉజ్బెకిస్థాన్‌కు చెందిన గ్యుల్‌చెక్రా బోబోకులోవాగా గుర్తించారు. కాలిపోయిన బాలిక మృత దేహాన్ని సమీపంలోని ఫ్లాట్‌లో పోలీసులు కనుగొన్నారు. బాలిక తల్లిదండ్రులు అపార్ట్‌మెంట్ విడిచి వెళ్లేంతవరకు వేచి చూసిన మహిళ.. ఆ చిన్నారిని చంపి.. తలను దేహం నుంచి వేరు చేసింది. ఆ తర్వాత సాక్షాలను నాశనం చేయడానికి ఫ్లాట్‌కు నిప్పుపెట్టింది అని పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ మత్తులో ఆ మహిళ ఈ దారుణానికి పాల్పడి ఉంటుందనే అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more