దేశంలో తీవ్ర సంచలనం రేపిన దేశద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జెఎన్‌యు విద్యార్థి కన్హయ కుమార్ బెయిల్ మీద బయటకు వచ్చారు. కన్హయ్య కుమార్ బయటకు వచ్చిన తర్వాత విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. తాము భారతదేశం నుంచి ఆజాదీ (స్వాతంత్య్రం) కోరట్లేదని.. దేశంలోనే స్వాతంత్య్రం కోరుతున్నాం అని కన్నయ్య కుమార్ స్పష్టం చేశారు. తిహార్ జైలు నుంచి విడుదలైన జేఎన్‌యూఎ్‌సయూ అధ్యక్షుడు కన్నయ్యకుమార్ వర్సిటీ ప్రాంగణంలో గంటకు పైగా భావోద్వేగ ప్రసంగం చేశారు. ఏబీవీపీపై తమకు ఎలాంటి పగ లేదని.. ఎందుకంటే తాము ప్రజాస్వామ్యవాదులం అని అన్నారు. వారిని తమ ప్రతిపక్షంగా మాత్రమే చూస్తామని కన్హయ కుమార్ అన్నారు.
ప్రధాని మోదీ భావాలతో తనకు విభేదాలు ఉండొచ్చు. కానీ.. ‘సత్యమేవ జయతే’ అంటూ ఆయన చేసిన ట్వీట్‌తో మాత్రం ఏకీభవిస్తున్నానని కన్హయ కుమార్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఆ పదాలు మన రాజ్యాంగంలో ఉన్నాయని చెప్సుకొచ్చారు. జేఎన్‌యూలో అడ్మిషన్ దొరకడం అంత సులభం కాదు. అలాగే.. జేఎన్‌యూలో ఉన్నవారిని మాట్లాడకుండా చేయడం కూడా అంత సులభం కాదని అన్నారు. తన అరెస్టు.. జేఎన్‌యూ మీద ఒక ప్రణాళిక ప్రకారం జరిపిన దాడి అని ఆరోపించారు. రోహిత్ వేములకు న్యాయం జరగకుండా అడ్డుకోవడానికి జరిగిన దాడి అని అభివర్ణించారు. జేఎన్‌యూ, రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో.. ఈ సమాజంలోని శాంతి కాముక, ప్రగతిశీల వర్గాల ఘర్షణ సుదీర్ఘంగా కొనసాగనుందని అన్నారు. దేశంలోని క్లిష్టమైన అంశాల నుంచి స్వాతంత్య్రం కోరడమే నేరమా? అని ప్రశ్నించారు. పీఎం మన్ కీ బాత్ గురించి మాట్లాడతారు.... అంతే తప్ప వినరు అని అన్నారు. సరిహద్దుల్లో చనిపోతున్న సైనికులకు నా వందనం. కానీ.. దేశంలో దుర్భర దారిద్య్రం కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల మాటేమిటి? మెజారిటీ సైనికుల తండ్రులు ఆ రైతులే. మా నాన్న ఒక రైతు. మా అన్న ఒక సైనికుడు. ఆ సైనికులు తమ ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్న యుద్ధాలకు బాధ్యులెవరు? అని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more