Dancing Naked Woman Stops Traffic in Houston

Naked woman dancing on top of truck shuts down highway 290

Houston Highway 290, woman dances naked, naked dancing woman, traffic blocked, traffic, houston, texas, naked woman, big rig, truck, 18-wheeler

After a three-vehicle crash occurred on Highway 290 just shortly after 9 a.m., a nude woman on top of a semi-truck made the traffic jam a little more difficult.

ITEMVIDEOS: నడివీధిలో నగ్నంగా నృత్యం చేసిన మహిళ.. ట్రాఫిక్ జామ్, రాకపోకలు బంద్..

Posted: 03/09/2016 11:11 AM IST
Naked woman dancing on top of truck shuts down highway 290

తన కారు ప్రమాదానికి గురి కాగానే ఓ మహిళ వికృత చేష్టలకు పాల్పడింది. తన కారు ప్రమాదానికి గురిచేసిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో తెలియకో.. లేక మతిస్థిమితం కోల్పోయే మోత్తానికి ఆ రోడ్డులో సుమారు మూడు గంటల పాటు రాకపోకలను నిలిపేసింది. అదెలా అంటే తన కారు ప్రమాదానికి గురి కాగానే అక్రోశాన్ని పట్టలేకపోయిన మహిళ ఏకంగా ఓ భారీ వాహానాన్ని ఎక్కి.. వంటిపై నూలుపోగు కూడా లేకుండా నడివీధిలో డాన్స్ చేసింది. అంతే అసలే ప్రమాదం కారణంగా సతమతమవుతున్న ట్రాఫిక్ కు తోడు.. అమె న్యూడ్ డాన్స్ చూసేందుకు జనం తమ వాహనాలను నిలిపివేశారు.

దీంతో పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అధికారులు రెండు మూడు గంటల పాటు ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపేసి.. మహిళను అదుపులోకి తీసుకున్నారు. టెక్సాస్ లోని హోస్టన్ లో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అసలు విషయం ఇది... ఓ మహిళ తన కారులో హోస్టన్ ఏరియాలో హైవే 290పై వెళ్తోంది. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, ఆమె కారుతో పాటు మూడు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఆ వెంటనే ఆమె ఓ పెద్ద వాహనంపైకి ఎక్కింది. క్షణాల్లో నగ్నంగా మారిపోయింది. కొద్దిసేపు అలాగే డాన్స్ చేసింది. అనంతరం అలాగే కూర్చుండిపోయింది.

తన శరీరాన్ని సాధ్యమైనంతవరకు చేతులు, కాళ్లతో కప్పి ఉంచే ప్రయత్నాలు చేస్తూ నానా తిప్పలు పడిందట. ఆమె డాన్స్ చేయడం ఆపిన వెంటనే కొందరు అధికారులు ఆమెను అతికష్టం మీద ఆ వాహనంపై నుంచి కిందగి దింపారు. అంతకుముందు గంటసేపు ప్రయత్నించిన ఆమె చేష్టలను ఆపలేకపోవడం గమనార్హం. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సుమారు ఉదయం 10గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని హోస్టన్ అగ్నిమాపక సిబ్బంది తెలిపింది. అయితే గంటపాటు ఆ ప్రాంతంలో దారిని మూసివేయడంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు వచ్చాయట. జెర్సీ ఏరియాలో అంతకుముందు కూడా ఆమె ఓ యాక్సిడెంట్ చేసిందని అనుమానాలు వ్యక్తం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Houston  naked Woman  Dancing  big rig  truck  18-wheeler  

Other Articles