warn of cases, counter opposition allegations.. lokesh hints party leaders

Lokesh meet with party leaders who purchased amaravathi land

nara lokesh, amaravathi land, capital land puirchasers, tdp party general secratary nara lokesh, party leaders, ministers, opposition party leaders, sakshi media, sakshi paper, YS jagan, opposition allegations

ap chief minister son, party general secratary nara lokesh meet with party leaders, who purchased amaravathi land.. hints them to warn opposition of cases.

ఎదురుదాడి, బెదిరింపులే అస్త్రాలు.. నేతలకు చిన్నబాబు క్లాస్..

Posted: 03/10/2016 10:27 AM IST
Lokesh meet with party leaders who purchased amaravathi land

రాజధాని అమరావతి ప్రాంతంలో టీడీపీకి చెందిన అమాత్యులు, నేతలు భూములు కొనుగోలు చేయడంపై రోజుకో విధంగా వివాదాస్పందంగా మారతుండడంతో.. పార్టీ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా ఈ కథనాలు పలు పత్రికల్లో ప్రసారం కాగానే నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టు వ్యవహరించిన నేతలు.. ఆ తరువాత తేరుకుని ఎదురుదాడికి దిగారు. అయితే నేతలు అమరావతి ప్రాంతంలోనే భూములు ఎందుకు కోనే్నారు.. ఇక్కడ కాకుండా రాష్ట్రంలో మరెక్కడ భూములు  కొన్నారో చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా.. వాటిని పెడచెవిన పెట్టి తమ మెండివాదనను తెరముందుకు తెస్తూ దానినే పదే పదే వల్లె వేస్తూ.. అటు మీడియాను, ఇటు ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో భూములు కొన్న పార్టీ అమాత్యులతో పాటు పలువురు నేతలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భేటీ అయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల, ఏలూరి సాం బశివరావు, ఎమ్మెల్సీ పయ్యావులతో పాటు మరికొందరు నేతలు పాల్గొన్నారు. రాజధాని భూ దురాక్రమణ పేరుతో ‘సాక్షి’ ప్రచురిస్తున్న వరుస కథనాలపై చర్చించారు. ఎవరెవరు ఎంత భూములు కొన్నారో ఆరా తీశారు.

అనంతరం ఈ కథనాలపై నేతలు స్పందించిన తీరును లోకేశ్ తప్పుపట్టారు. ఎవరికి వారు వ్యక్తిగతంగా వివరణలు ఇచ్చుకున్నారని, అలా కాకుండా నేతలందరూ సమిష్టిగా తమతో పాటు ప్రభుత్వానిది ఏమాత్రం తప్పులేదని చెబితే బాగుండేదన్నారు. సాక్షి పత్రిక పై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేయాలని, కేసులు పెడతామని బెదిరించాలని ఆదేశించినట్లు సమాచారం. ఇలాఉండగా రాజధాని ప్రాంతంలో తాను భూములు కొన్నట్లు వచ్చిన వార్తలపై ఆ ప్రాంతానికి చెందిన నేతలు స్పందించకపోవటంపై లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ ప్రాంతంతో సంబంధం లేని వారు మాత్రం తన విషయంలో బాగా స్పందించారని లోకేశ్ అన్నట్లు సమావేశంలో పాల్గొన్న నేత ఒకరు చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  amaravathi land  capital land puirchasers  tdp  

Other Articles