London exchenge will help in the Amaravati construction

London exchenge will help in the amaravati construction

Amaravati, London, London exchange, Amaravati Construction, AP, Chandrababu Naidu

AP CM Chandrababu naidu met London exchange officails in London. after the meeting they agree to help new capital city Amaravati.

అమరావతికి లండన్ సాయం

Posted: 03/12/2016 07:39 AM IST
London exchenge will help in the amaravati construction

ఏపి కోసం నిర్మిస్తున్న నూతన రాజధాని అమరావతికి లండన్ నుండి నిధులు రానున్నాయి. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ లో చేస్తున్న పర్యనటలో బాగంగా లండన్ స్టాక్ మార్కెట్ అమరావతి నిర్మాణానికి సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు బృందం లండన్ వాణిజ్య, వ్యాపారవేత్తలు, స్టాక్ ఎక్సేంజ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లండన్ స్టాక్ ఎక్సేంజి గురించి చంద్రబాబు బృందానికి ఆ సంస్థ సీఈఓ నికిల్ రాఠీ వివరించారు. అమరావతిలో భాగస్వామ్య అవకాశాలపై కూడా చంద్రబాబుతో లండన్ స్టాక్ ఎక్సేంజ్ ప్రతినిధులు చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ఈ భేటీలో చర్చ జరిగింది. మౌలిక సదుపాయాల కోసం అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపైనా వారి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్, మౌలిక సదుపాయాల కల్పనపై చంద్రబాబు నాయుడు బృందంతో లండన్ స్టాక్ ఎక్సేంజ్ ప్రతినిధులు చర్చలు జరిపారు. అమరావతిలో భాగస్వామ్య అవకాశాలపై మాట్లాడారు. చివరకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకొచ్చారు. అలాగే. రాజధాని నిధుల సేకరణలో ఏపీ ప్రభుత్వానికి సహకరించేందుకు అంగీకారం తెలిపారు.

అంతకు ముందు చంద్రబాబు నాయుడి బృందం లండన్‌ లోని థేమ్స్‌ నది ఒడ్డున ఉన్న 'లండన్‌ ఐ'ని సందర్శించింది. లండన్ ఐ తరహాలో ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రాన్ని ఏపీ రాజధాని అమరావతిలో కూడా పర్యాటక కేంద్రం ఏర్పాటుపై పరిశీలించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఈ నెల 13వ తేదీ వరకూ చంద్రబాబు నాయుడు లండన్-లోనే ఉండి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో పాల్గొంటారు. ఏపీ రాజధాని నిర్మాణానికి సహకారంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడుల విషయంపై పలువురు వ్యాపార, వాణిజ్య ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అవుతారు. ముఖ్యమంత్రి వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravati  London  London exchange  Amaravati Construction  AP  Chandrababu Naidu  

Other Articles