Telagana govt has to release hob notifications

Telagana govt has to release hob notifications

Krishnaiah, TS, Telangana, telangana Assembly, KCR, Jobs, Job Notifications in Telangana, Telangana DSC

TDP MLA R Krishnaiah questioned TS govt on Job Notifications. He said that many vacancies in all Departments but govt did not giving new notifications like DSC, Group2, Gropu3, Group4.

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ఎక్కడ..?

Posted: 03/12/2016 11:37 AM IST
Telagana govt has to release hob notifications

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, బిసి సంఘం నేత ఆర్ కృష్ణయ్య తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేన్లు జారీ చెయ్యాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం ప్రకటనల్లో మాత్రం భారీగా ఖాళీలు ఉన్నట్లు చెబుతోందని కానీ తీరా చూస్తే నోటిఫికేషన్లలో మాత్రం తక్కువ పోస్టులు ఉంటున్నాయని అన్నారు. గ్రూప్ 2తో సహా ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాల్సిందిగా అయా శాఖలు ప్రభుత్వానికి లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలు 18వేలు ఉన్నట్లు డిజిపి ప్రకటించారు. కానీ కేవలం తొమ్మిది వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారని ఆర్. కృష్ణయ్య వెల్లడించారు. అలాగే ఎస్సై ఖాళీలు 1600 ఉండగా అందులో నాలుగు వందల చిలుకు ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. డిఎస్సీ కోసం దాదాపు ఐదు లక్షల మంది నిరుద్యోగులు బిఈడి, డిఈడీ, పిఈటీ కోర్సులు చేసి ఎదురుచూస్తున్నారని అన్నారు. వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishnaiah  TS  Telangana  telangana Assembly  KCR  Jobs  Job Notifications in Telangana  Telangana DSC  

Other Articles