cm babu responsible for deaths at pushkara ghat, undavalli files affidavit

Cm chandrababu responsible for deaths at pushkara stampede

Undavalli Arunkumar, Pushkarni Ghat, government, one member commission, CM chandrababu, godavari pushkara stampede, godavari pushkara deaths, undavalli affidavit on godavari deaths,

former MP undavalli arunkumar files affidavit to one member commission helding CM chandrababu responsible for deaths at godavari pushkara stampede.

ఆ దర్ఘటనకు బాధ్యత ముఖ్యమంత్రిదే.. ఏకసభ్య కమీషన్ ముందు ఒకే ఒక్కడు

Posted: 03/12/2016 11:16 AM IST
Cm chandrababu responsible for deaths at pushkara stampede

ఆయన ఎవరిపైనా సామాన్యంగా ఎక్కు పెట్టరు. ఎక్కుపెట్టారో అవతలి వారి అంతతొందరగా వదిలిపెట్టరు. ఆయన మరెవరో కాదు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. ఏకంగా ఈనాడు గ్రూప్ అధినేత రామోజీ రావు విషయంలోనే కూపీలు లాగి ఆయనను కోర్టుకు లాగాడు. ఇంకా అ కేసులు నడుస్తున్నాయి కూడా. అయితే ఆయన తాజాగా మరో ఘటనపై కూడా స్పందించారు. అంతేకాదు అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమకూరుస్తానని చెప్పారు. ఆ ఘటనే గోదావరి పుష్కరాల తోక్కిలాట.

గోదావరి పుష్కరాల ప్రారంభం సందర్భంగా గతేడాది జూలై 14న రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట దుర్ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ప్రధాన కారణమని ఉండవల్లి ఆరోపించారు. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌కు ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. పుష్కర ఘాట్‌లో సీఎం గంటల తరబడి ఉండడంతో భక్తుల రద్దీ పెరిగిపోయిందని, తరువాత ఒక్కసారిగా భక్తులను ఘాట్‌లోకి వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని చెప్పారు. ఈ ఘటనలో 29 మంది మృత్యువాత పడ్డారని, 52 మంది గాయపడ్డారన్నారు.

తొక్కిసలాటకు సంబంధించిన ఆధారాలు సమర్పించడానికి తనకు సమయం ఇవ్వాలని కమిషన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. పుష్కర ఏర్పాట్లు, భక్తుల రద్దీని నియంత్రించడంలో అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రముఖులు స్నానాలు చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ సీఎం పుష్కర ఘాట్‌లో స్నానం చేశారని, ప్రజలకు సౌకర్యాలు, రక్షణ కల్పించాల్సిన అధికార యంత్రాంగం ఆయన రక్షణలో ఉండిపోవడంతో తొక్కిసలాట జరిగిందని ఉండవల్లి వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles