Kids made to stand naked outside class

Kids made to stand naked outside class

Teacher, nude, class room, Students, Punishment for Students

The Malvani police of Malad has registered a case against a teacher and the owner of a coaching class, after taking suo moto action in the matter, following a video clip on WhatsApp going viral with two kids standing in the nude outside a coaching class. A senior police official from the Malvani police station said that no arrests have been made and police is investigating the matter.

ఆ పని చెయ్యలేదని బట్టలు లేకుండా చేసింది

Posted: 03/14/2016 10:36 AM IST
Kids made to stand naked outside class

టీచర్లు విద్యార్థులను వేధిచడం రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఓ టీచర్ చంటి పిల్లాడిని గొడ్డును బాదినట్లు బాదడం, టీచర్ ఎండలో నిల్చోమని చెప్పడం ఇలా రోజూ ఏదో వార్త మీడియా ఛానల్ లో వస్తూనే ఉంది. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు రాక్షసంగా ప్రవర్తించారు. హోంవర్క్ చేయలేదన్న చిన్నకారణంతో దారుణమైన శిక్ష విధించారు. ఆ చిన్నారులను బట్టలు లేకుండా..తోటి పిల్లల ముందు నిలబెట్టించి అవమానించారు.

ఈ దారుణ చోటుచేసుకుంది ముంబాయిలోని మాల్వానిలోని శ్రీ అనే ట్యూషన్ క్లాస్ సెంటర్ లో. ఇక్కడకి సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చదువుతున్న ఇద్దరు విద్యార్దులు ట్యాషన్‌ కు వెళుతున్నారు. అయితే వారు తమ టీచర్లు ఇచ్చిన హోంవర్క్ చేయలేదు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయులు ఆ ఇద్దరు విద్యార్థుల బట్టలు విప్పించి క్లాస్ బయట నిలబెట్టారు. అంతేకాకుండా, వారిని వీడియో తీసి వాట్సాప్ లో కూడా పెట్టారు. అయితే ఈ వీడియా కాస్త ముంబై పోలీస్‌ కమిషనర్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన సదరు టీచర్ల పై చర్యలకు ఆదేశించారు. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు వారిపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ 82, 75 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teacher  nude  class room  Students  Punishment for Students  

Other Articles