CCTV footage of Dalit man being hacked to death in Tamil Nadu

Newly wed couple hacked in tamilnadu husband dead

honour killing, dalit murdered, wife attacked, Dalit man hacked to death, Honour killing in Tamil Nadu Dalit youth hacked to death in Tirupur, murder, Marriage, Dalit, tamil nadu police, latest tamil nadu police, Hindu Girl, Dalit, Tirupur, CCTV, Tirupur murder

In a suspected case of honour-killing, a 22-year-old Dalit graduate was on Sunday allegedly hacked to death by three men on a motorbike in Tamil Nadu

ITEMVIDEOS: పరువుహత్యాల పరాకాష్ట.. నడిరోడ్డుపై నూతన దంపతులపై దాడి, భర్త హత్య

Posted: 03/14/2016 10:24 AM IST
Newly wed couple hacked in tamilnadu husband dead

తమిళనాడులో ఘోరం జరిగింది. అగ్రకుల వర్గాల పరువు హత్యలకు ఈ ఘటన పరాకాష్ట. తమ ఇంటి ఆడపడచును దళిత వర్గానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడన్న అక్కస్సుతో వారిపై నడిరోడ్డు మీద దాడి చేసి హత్యమార్చిన ఘటన. తరుపూర్ లో రద్దీగా వుండే ఆ ప్రాంతం నిండు కౌరవ సభలా మారింది. నూతన దంపతులపై దాడి, హత్య ఘటనలు జరుగిన తరువాత కూడా అక్కడే కొద్దిసేపు తచ్చాడని హంతకులు.. నిదానంగా తమ బైక్ ఎక్కి అక్కడి నుంచి జారుకుంటున్నా.. వారిని ఎవరూ అడ్డగించే ప్రయత్నం కూడా చేయలేదు. వారు జారుకున్న తరువాత బాధితుల వద్ద స్థానికులు గుమ్మిగూడారు.

నూతన దంపతులలో దళితుడిని నరికి చంపి.. అతడి భార్యపై ముగ్గురు వ్యక్తులు విచక్షనా రహితంగా దాడి చేశారు. తిరుపూర్‌లో రద్దీగా ఉండే మార్కెట్లో పట్టపగలే జరిగిన ఈ ఘోరం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రద్దీగా ఉన్న రోడ్డులో దంపతులను ఫుట్‌పాత్‌ మీదకు ఓ వ్యక్తిని లాగిన దుండగులు, అతడిని కొడుతూ, ఆయుధాలతో దాడి చేయడం కనిపించింది. అతడి కదలికలు ఆగిపోయిన తర్వాత.. అతడి భార్యమీద వాళ్ల ప్రతాపం మొదలైంది. ఆమెను కింద పడేసి కొట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ నిందితులు ముగ్గురూ మోటారు సైకిల్ మీద పారిపోయారు.

ఇంజనీరింగ్ మూడో తరగతి చదువుతున్న వి.శంకర్ (23), ఎనిమిది నెలల క్రితం కౌసల్య (19) అనే హిందూ యువతిని పెళ్లి చేసుకున్నాడు. కౌసల్య అగ్రకులానికి చెందిన కుటుంబం నుంచి రావడంతో.. ఆమె తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతున్నారు. పెళ్లయిన తర్వాత వాళ్లు ఒప్పుకొంటారని తాము అనుకున్నామని, కానీ చివరకు తమ కొడుకును కోల్పోవాల్సి వచ్చిందని శంకర్ తండ్రి వేలుసామి ఆవేదన వ్యక్తం చేశారు.

 మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  murder  Marriage  Dalit  Honour Killing  

Other Articles