ED getting ready to seaze Vijay Malyas Passport

Ed getting ready to seaze vijay malyas passport

Vijay Malya, Passport, London, ED, Enforcement Directorate

rinks tycoon and motor racing boss Vijay Mallya faces a sensitive diary clash this week as the season-opening Australian Formula One Grand Prix coincides with an appointment to appear before the Enforcement Directorate.

విజయ్ మాల్యా 18 వరకు రాకపోతే పాస్ పోర్ట్ రద్దు

Posted: 03/15/2016 04:02 PM IST
Ed getting ready to seaze vijay malyas passport

కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా అప్పులు చేసి దేశం వదిలివెళ్లిన తర్వాతి నుండి దేశంలో తీవ్ర దుమారం రేగుతోంది. విజయ్ మాల్యా బ్యాంకుల వద్ద చేసిన దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టినట్లు కేసు నమోదుఅయింది. కాగా పార్లమెంట్ సమావేశాల్లో దీని మీద తీవ్ర దుమారమేరేగింది. అయితే రంగంలోకి దిగిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చర్యలకు దిగింది. విజయ్ మాల్యా ను దేశానికి తిరిగి రప్పించేందుకు అన్ని చర్యలుకు దిగింది.

హవాలా కేసులో ఈడీ ముందు మార్చి 18వ తేదీలోగా విచారణకు హాజరుకాకపోతే లండన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పాస్‌పోర్టును రద్దుకు చర్యలు తీసుకుంటామని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో ఇప్పటికే కసరత్తు జరిగిపోయిందని, ఆయన విచారణకు రాకపోయినట్లయితే తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని తెలిపాయి.విజయ్ మాల్యా కేసులో ఇప్పటికే సుప్రీం కోర్టు విజయ్ మాల్యాకు నోటీసులు జారీ చేయడం, కేసు విచారణను మార్చి 30వ తేదీకి వాయిదా వేసింది. ఆయన కోర్టు విచారణకు హాజరుకాకపోతే ఆయన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాల్సిందిగా కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈడీ మాత్రం ఏకంగా మాల్యా పాస్‌పోర్టును రద్దు చేయడానికే చర్యలు తీసుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Malya  Passport  London  ED  Enforcement Directorate  

Other Articles