Supreme Court Directs High Court to Take Up Roja Suspension Case Immediately

Relief to ysrcp mla roja in supreme court on suspension

Supreme Court, High Court, Roja, Suspension Case, andhra pradesh assembly, roja suspension case, ysrcp mla roja, suspension petititon, high court, YSR Congress Party MLA Roja

Supreme Court of India on Tuesday directed the Andhra Pradesh-Telangana joint High Court to take up the petition filed by YSR Congress Party MLA Roja challenging her suspension from the Legislative Assembly.

సుప్రీంకోర్టులో ఊరట.. సంతోషంగా వుందన్న రోజా

Posted: 03/15/2016 05:55 PM IST
Relief to ysrcp mla roja in supreme court on suspension

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె పిటిషన్ను విచారించాలంటూ ఉన్నత ధర్మాసనం మంగళవారం  హైకోర్టు చీఫ్ జస్టిస్కు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా హైకోర్టులో అసిస్టెంట్ రిజిస్ట్రార్ వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. బుధవారం ఉదయం ఎమ్మెల్యే రోజా పిటిషన్పై విచారణ జరపాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆదేశాలను ఈ-మెయిల్లో హైకోర్టుకు పంపుతామని జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.

కాగా తన పిటిషన్ పై విచారణ చేపట్టాలని ఉన్నత ధర్మాసనం  హైకోర్టు చీఫ్ జస్టిస్కు ఆదేశాలు ఇవ్వడంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు. తన పిటిషన్ పై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. హైకోర్టులో కచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై అన్యాయంగా సస్పెన్షన్ వేటు వేశారని, ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతున్నాననే తనపై కక్ష సాధిస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు.

అలాగే ప్రస్తుతం జరుగుతున్న శాసనసబ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలనే దానిపైనా రేపు హైకోర్టులో నిర్ణయం వస్తుందని అన్నారు. నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తెచ్చేందుకు ప్రజలను తనను ఎన్నుకున్నారని, వారికి న్యాయం చేయాలంటే శాసనసభకు హాజరై వారి సమస్యలను వినిపించాల్సి ఉందన్నారు.  న్యాయ వ్యవస్థను నమ్ముకుని వచ్చిన తనకు న్యాయం జరిగిందన్నారు. ఏపీలో రాక్షస పాలన నడుస్తోందని ఆమె ధ్వజమెత్తారు,

కాగా రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్‌పై వైఎస్సార్‌సీపీ శాసనసభ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టిన సందర్భంగా ఎమ్మెల్యే రోజా అనుచితంగా నినాదాలిచ్చారంటూ ఆమెను రూల్ 340(2) ప్రకారం ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించడం, స్పీకర్ కోడెల శివప్రసారావు మూజువాణి ఓటుతో దాన్ని ఆమోదించింది. దీంతో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ రోజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp mla roja  supreme court  suspension petititon  high court  

Other Articles