AAI approves flight landing in Shirdi, air services to start in four months

Shirdi airport to be operational soon

Shirdi, Maharashtra Airport Development Company, airport, Airports Authority of India (AAI), Shirdi airport, flight landing shirdi, shirdi aiport operational, shirdi airport in four months, shirdi sai devotees, shirdi sai baba, shirdi brindavanam

Shirdi airport will be operational in four months with the Airports Authority of India (AAI) giving its green signal.

షిర్డీ సాయి భక్తులకు శుభవార్త.. త్వరలో అందుబాటులోకి వాయుమార్గం

Posted: 03/18/2016 04:47 PM IST
Shirdi airport to be operational soon

షిర్డీ సాయి భక్తులకు శుభవార్త. అయితే షిరిడీ సాయి సంపన్న భక్తులకు మాత్రమే కాదండీ.. మధ్య అధికాదాయ వర్గాల భక్తులకు కూడా ఇది నిజంగా శుభవార్తే. ఇప్పటివరకు పవిత్ర ఫుణ్యక్షేత్రం షిర్డీకి వెళ్లాలంటే రోడ్డు, రైలు మార్గాలే అందుబాటులో వున్నాయి. అందరి దేవుడు ఒక్కడే అంటూ సర్వమతాల వారి చేత సాయి అని పిలుపించుకున్న గురుదేవుడు షిర్డీ సాయి సమాధి అయిన ఫుణ్యస్థాలానికి ఇక వాయు మార్గం కూడా అందుబాటులోకి రానుంది.

మన్మాడ్ వరకు వెళ్లి అక్కడి నుంచి ఎంతో వ్యవప్రయాసలకు ఓర్చి షిరిడీ చేరుకునే భక్తులకు గత కొన్నేళ్ల కిందట షిర్డీలో రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్టేష్టన్ కు అధిక సంఖ్యలో రైళ్లు రాకపోకలు లేని కారణంగా. ఇప్పటికీ మన్మాడ్, పరిసర ప్రాంతాల్లో రైలు దిగి అక్కడి నుంచి షిర్డీకి ఎంతో మంది భక్తులు చేరుకుంటున్నారు. ఇక మరికోందరు రైలు ప్రయాణం కష్టంగా పరిగణించి వారి వారి సోంత వాహనాల్లో చేరుకుంటున్నారు. అయితే మార్గమధ్యంలో దోంగల బెడద కూడా లేకపోలేదు. స్వయంగా మన రాష్ట్రానికి చెందిన టూరిజం బస్సలనే మార్గమధ్యంలో దోపిడీ దోంగలు అపి నిలువునా దోచుకున్న ఘటనలు వున్నాయి.

దీంతో షర్డీ ప్రయాణం అంటేనే జంకే పరిస్థితి కూడా కొందరిలో కలిగింది. ఈ నేపథ్యంలో విమానయాన సౌకర్యాన్ని కల్పించడంతో అనేక మంది సాయి భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోనున్నారు. ముఖ్యంగా ఈ సౌకర్యం కోసం ఎంతో కాలంగా సాయి భక్తులు ఎదురు చూస్తున్న షిర్డీకి విమాన ప్రయాణం కల త్వరలో సాకారం అవుతోంది. షిర్డీకి సమీపంలో మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ (ఎంఏడీసీ) విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే రన్‌వే, ట్యాక్సీ వే, టెర్మినల్ నిర్మాణం పూర్తి అయింది.

ఇక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తోపాటు నీరు, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. 2,500 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్‌వే ఏర్పాటైంది. విమానాశ్రయంలో ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రై వేటు విమానాలకు అనుమతి ఇవ్వనున్నారు. జనవరి నుంచి వాణిజ్య అవసరాలకు ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రానుందని ఎంఐడీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం షిర్డీకి రైలు సౌకర్యం కూడా ఉంది. విమానాశ్రయం ప్రారంభమైతే వేలాది మంది భక్తులకు పెద్ద ఊరట లభించనుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles