Jail authorities in a fix over Chhota Rajan's deteriorating health, move court

Chhota rajan in critical condition

gangster chhota rajan, gangster, chhota rajan ill health, chhota rajan, cbi, central bureau of investigation, chhota rajan tihar jail, chhota rajan health, jail authorities, Tihar Jail, Mafia don, Chhota Rajan, Bali, Diabetes, Kidney failure, extortion, drug smuggling

The Tihar Jail​ authorities are in a fix over deteriorating health conditions of mafia don Chhota Rajan or Rajendra Sadashiv Nikalje, as per a media report.

విషమించిన మాఫియా డాన్ అరోగ్యం.. కోర్టును ఆశ్రయించిన జైలు అధికారులు

Posted: 03/19/2016 01:28 PM IST
Chhota rajan in critical condition

మూడు దశాబ్దాల పాటు పోలీసులను మూడు చెరువుల నీళ్లు తాగించిన మాఫియా డాన్ చోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ్ నికల్జే ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పటికే మలేసియా, సింగపూర్ లలో్ ఆయన పలు ఆస్పత్రులలో చికిత్స చేయించుకున్నాడని, అయినా తనను అనారోగ్యం పట్టి పీడిస్తుందని తెలుస్తుంది. బాలిలో ఇండోనేసియా పోలీసుల చేతికి చిక్కిన చోటా రాజన్ ను సీబీఐ అధికారులు దేశానికి రప్పించగలిగారు. ఆ తర్వాత అప్పటికే అతడిపై నమోదైన కేసుల విచారణ ప్రారంభం కాగా, ప్రస్తుతం అతడు ఢిల్లీలోని తీహార్ జైల్లో కాలం వెళ్లదీస్తున్నాడు. అరెస్టయ్యే నాటికే పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న చోటా రాజన్... జైల్లో అడుగుపెట్టిన నాటి నుంచి మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.

డయాబెటీస్ తో పాటు గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్న అతడి మూత్రపిండాలు రెండూ చెడిపోయాయి. తక్షణమే డయాలసిస్ చేస్తే తప్పించి అతడి ప్రాణాలు నిలిచేలా లేవు. అయితే తీహార్ జైల్లో అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలు అతడికి ఉపశమనం కల్పించడం లేదు. దీంతో అతడిని ఢిల్లీలోని ఓ మెరుగైన ఆసుపత్రిలో చికిత్స చేయిస్తామంటూ జైలు అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 15ననే పోలీసులు దాఖలు చేసిన సదరు పిటిషన్ పై ఈ నెల 30న విచారణ జరగనుంది.  ఈ మేరకు తీహార్ జైలుకు చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘మెయిల్ టుడే’ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.    

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tihar Jail  Mafia don  Chhota Rajan  Bali  Diabetes  Kidney failure  

Other Articles