India vs Pakistan World T20 Match Scores Kolkata Weather Updates: Toss at 8.10, 18-over-a-side game

India the toss and decided to bowl first

world t20, world t20 updates, India, ind vs pak, world t20 news, world t20 scores, ms dhoni, ms dhoni captain, ms dhoni india, t20 world cup-2016, pakistan, ICC T20 WC, India vs pakistan, jasprit bumrah, mohammed shami, hardik pandya, yuvvraj, kohli, rohit sharma, cricket news, cricket

The chief minister of West Bengal Mamata Banerjee is honoured former cricketers. Pakistan captain and politician Imran Khan is first. He will be followed by Wasim Akram, Waqar Younis and Sunil Gavaskar. And then Virender Sehwag and Sachin Tendulkar.

ప్రముఖులను సన్మానించిన మమత, దాయాధుల పోరు 18 ఓవర్లకు కుదింపు..

Posted: 03/19/2016 08:15 PM IST
India the toss and decided to bowl first

వరల్డ్ టీ 20లో భాగంగా ఈడన్ గార్డన్ స్టేడియంలో మెగా ఈవెంట్ గా జరగబోతున్న దాయాధులు భారత్, పాకిస్థాన్ సమరంలో ధోని సేన బౌలింగ్ చేయడానికి ఎంచుకుంది. పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గ్రౌండ్ లో తేమ అధికంగా వుండడం వల్ల బ్యాటింగ్ చేయడం కన్నా ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. కాగా ఇవాళ ఉదయం నుంచి దాయాధుల సమరానికి తొలుత వరుణుడు ఆటంకం కల్గించడంతో ఐసీసీ రిఫ్రీ ఈ మ్యాచ్ ను 18.0 ఓవర్లకు కుదించారు.

అయితే బౌలర్లలో తమ నిర్ణీత ఓవర్లు నాలుగు వేయనుండగా, కేవలం ఇద్దరు మాత్రం మూడు ఓవర్లకే పరిమితం చేయాలని ఐసీసీ నిబంధన విధించింది. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక మ్యాచ్లో గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, టీమిండియా ఒక మ్యాచ్ లో ఓటమి పాలై తీవ్రమైన ఒత్తిడిలో పోరుకు సన్నద్ధమైంది. ఇప్పటివరకూ జరిగిన వరల్డ్ కప్లలో భారత్ దే పై చేయి అయినా, ఈడెన్ లో మాత్రం పాకిస్తాన్ రికార్డు మెరుగ్గా ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనబడుతోంది.

ఇక మరోవైపు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ అఫ్ బెంగాల్ ప్రముఖులను సన్మానించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేతుల మీదుగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ సహా ఫేస్ బౌలర్ వసీమ్ అక్రమ్ తో పాటుగా పాకిస్థాన్ క్రికెటర్, జట్టు కోచ్ వకార్ యూనిస్ లను సన్మానించింది. వీరితో పాటు మన దేశ క్రికెటర్లు, టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లను మమతా సన్మానించారు. కాగా వీరితో పాటు బాలీవుడ్ మెగాస్టార్. బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాకిస్థాన్ గాయకుడు షహఫత్ అమానత్ అలీ ని కూడా మమత సన్మానించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : t20 world cup-2016  India  pakistan  ICC T20 WC  India vs pakistan  

Other Articles