Facebook CEO Zuckerberg's run in Beijing's toxic air stirs China

Facebook s mark zuckerberg jogs in china without mask

Facebook, Mark Zuckerberg, Tiananmen Square, World Health Organization, Chinese President Xi Jinping, Tsinghua University, Peng Yuanwen, latest news

A photo of Facebook founder Mark Zuckerberg jogging in downtown Beijing's notorious smog has prompted a torrent of amusing comments and some mockery on Chinese social media.

చైనాలో జుకర్‌బర్గ్ వందమైలు పోస్టుపై విమర్శల వెల్లువ

Posted: 03/19/2016 06:52 PM IST
Facebook s mark zuckerberg jogs in china without mask

డబ్బుంటే చాలు ఏం చేసినా, ఎలా చేసినా అది ప్రచారం అవుతుంది. ఇక అదే ప్రచార సామ్రాజ్యానికి రారాజులా వెలుగొందుతున్న వ్యక్తి అయితే ఆయనకు లభించే ప్రచారం అంతాఇంతా కాదు. సరిగ్గా అలానే జరుగుతుంది ఈ వ్యక్తి విషయంలో ఆయన ఎవరో కాదు.. ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్. వంద రోజులుగా ప్రపంచ దేశాల్లో ఒక్కో చోట ఒక్కో మైలు పరుగెడుతూ.. అటు ఆరోగ్యం, ఇటు ప్రచారం చేసుకుంటూ తనదైన శైలిలో సాగిపోతున్నాడు జుకర్‌బర్గ్. ఇవాళ ఆయన చైనాలోని తియానన్మెన్ స్క్వేర్‌ను సందర్శించి.. అక్కడే పరుగెత్తారు.

తియానన్మెన్ స్క్వేర్‌లో తాను పరుగెత్తుతున్న దృశ్యాన్ని జుకర్ బర్గ్ అక్కడి నుంచే పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది. పలు విమర్శలకు కూడా తావిస్తుంది. నెట్ జనులు ఆయనపై మండిపడుతున్నారు. ఫేస్‌బుక్‌ను నిషేధించిన దేశంలో దాని అధిపతి పర్యటించడమా? అని కొంతమంది విమర్శలు చేయగా, 26 ఏళ్ల క్రితం వేలాది మంది విద్యార్థులను ట్యాంకులతో తొక్కించిన తియానన్మెన్ స్క్వేర్‌ను సందర్శించడం ఏమిటని మరి కొంతమంది విమర్శలు సంధించారు.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా ప్రజలను కస్టమర్లను చేసుకోవడం కోసం జుకర్‌బర్గ్, చైనా ప్రభుత్వం గడ్డికరుస్తున్నారని ఇంకొంతమంది ఘాటుగా కామెంట్ చేశారు. అయితే మరికోందరు మాత్రం ప్రపంచ కాలుష్య నగరాల్లో నెంబర్ వన్‌గా నిలిచినా బీజింగ్‌లో ముఖానికి మాస్క్ కూడా లేకుండా తిరుగుతున్నావా? అక్కడ పరుగెట్టడం అత్యంత ప్రమాదకరం, అనారోగ్యం కూడానంటూ కొందరు సరదాగా కామెంట్ చేశారు.

‘ఒకప్పుడు అందరూ వదిలేసిన నగరంలో నేడు నేను పరుగెత్తాను. ఇది నా వందో మైలు కావడం కూడా విశేషమే. నా వెంట ఇక్కడ, ప్రపంచంలో నాతో కలసి పరుగెత్తిన వారికి ధన్యవాదాలు. తియానన్మెన్ స్క్వేర్‌లో పరుగెత్తడం ద్వారా నా చైనా పర్యటన ప్రారంభమైంది’ అంటూ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌లో తన ఫొటోతోపాటు కామెంట్ పోస్ట్ చేశారు. తన పోస్ట్‌ పై వచ్చిన కామెంట్లలో కొన్నింటికి మాత్రమే జుకర్‌బర్గ్ సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా విమర్శలను పట్టించుకోలేదు. ఓ కమ్యూనిస్టు దేశంతో ఐడెంటిఫై అవుతావా అంటు కూడా విమర్శలు వచ్చాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Facebook  Mark Zuckerberg  Beijing  jog  China  

Other Articles