good news to employees, to get double bedroom houses soon

Double bedroom scheme avail for less than 6 lak income eployees

bonthu rammoham, double bedroom, income, exemption, venkaian naidu, government employees, private employees, telangana government, central government, hyderabadis, hyderabad employees

good news to employees whose income is less than rs 6 lakh per annum, telangana government to allot houses

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు తీపి కబురు.. రూ.6 లక్షల లోపు అధాయమున్నవారికే..

Posted: 03/20/2016 07:24 PM IST
Double bedroom scheme avail for less than 6 lak income eployees

జీహెచ్‌ఎంసీ పరిధిలోని వార్షికాదాయం రూ. 6 లక్షలలోపు ఉన్న ప్రభుత్వ.. ప్రైవేటు ఉద్యోగులకు శుభవార్త. వీరికి రాయితీపై ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సహకారం అందించాల్సిందిగా శుక్రవారం ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీ రామారావు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కోరారు. దీనికి ఆయన సానుకూల సంకేతాలిచ్చినట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు. ఆయన జీహెచ్‌ఎంసీలో విలేకరుల తో మాట్లాడుతూ... సంవత్సరాదాయం రూ. 6 లక్షల లోపు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతరుల  కోసం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కు గృహ నిర్మాణ పథకం కింద నిధులివ్వాల్సిందిగా కోరామన్నారు.

నగరంలో నిర్మిస్తు న్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలన్నింటితో కలిపి దాదాపు రూ.9 లక్ష లు ఖర్చవుతోంది. వార్షికాదా యం రూ.6 లక్షలలో పు ఉన్న  దిగువ మధ్య తరగతి వారికి ఒక్కో ఇంటికి కేం ద్రం రూ.2.50 లక్ష లు ఇస్తే.. జీహెచ్‌ఎం సీ రూ.2 లక్షలు సా యం చేస్తుందని చెప్పారు. లబ్ధిదారుల వాటాగా రూ. 2 లక్షలు చెల్లిస్తే.. మిగతా వ్యయాన్ని బ్యాంకు రు ణాల ద్వారా అందించే యోచన ఉందన్నారు. దీనికి విధి విధానాలు రూపొందించాల్సి ఉందన్నారు.

నగరంలో నిర్మాణం పూర్తయి... ఖాళీగా ఉన్న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని మేయర్ చెప్పారు. ఈ ఇళ్లలో అక్రమంగా ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తామని చెప్పారు. స్మార్ట్‌సిటీ ద్వారా అందే రూ.100 కోట్లు నగరానికి చాలవని... వేరే పథకం ద్వారా పెద్దమొత్తంలో నిధులివ్వాల్సిందిగా మంత్రి కేటీఆర్ కోరారన్నారు. నిర్మాణం పూర్తయిన స్లాటర్ హౌస్‌లను వందరోజుల ప్రణాళికలో భాగంగా వినియోగంలోకి తెస్తామన్నారు. వాటిపై ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటామని... స్లాటర్ హౌస్‌లకు సంబంధించి ఢిల్లీలో జరిగిన సదస్సులోనూ ఈ అంశం ప్రస్తావనకొచ్చింద ని ఆయన తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bonthu rammoham  double bedroom  income  exemption  

Other Articles