Paris Attacks Suspect Allegedly Backed Out of Bombing Plan

Paris attacks suspect salah abdeslam captured in brussels raids

belgium,brussels,november attacks,paris attacks,raids,security,suspect,terror alert,terror attacks,terror threat,Salah Abdeslam,assault,

Salah Abdeslam, the main surviving suspect in the Paris attacks, is talking to authorities about his role and intentions, Paris prosecutor François Molins said

ఆ క్షణం అలా చేయలేక.. ఇలా చిక్కాను..

Posted: 03/20/2016 07:27 PM IST
Paris attacks suspect salah abdeslam captured in brussels raids

పారిస్ దాడుల సమయంలో చివరి క్షణాలలో తాను పేల్చేసుకోలేక పోయానని ఉగ్రవాది సలాహ్ అబ్దెస్లామ్ తెలిపాడు. గత నవంబర్ లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో జరిగిన ఉగ్రదాడుల సూత్రధారి సలాహ్ అబ్దెస్లామ్ని బెల్జియంలో శనివారం అరెస్ట్ అరెస్ట్ చేశారు. తాను సూసైడ్ బాంబర్ ను అని పోలీసుల విచారణలో చెప్పాడు. 4 నెలల నుంచి అతనికోసం వేట ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. ఎట్టకేలకు గత నవంబర్ 13న మారణహోమం సృష్టించి దాదాపు 130 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదిని పట్టుకున్నందుకు ప్రపంచదేశాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. దాడులు చేసినరోజు తనను తాను పేల్చివేసుకోవాలనే అక్కడికి వచ్చినట్లు వెల్లడించాడు.

తన అన్న బ్రహీంను కూడా సూసైడ్ బాంబర్ గా ఉపమోగించుకున్నట్లు పారిస్ దాడుల మాస్టర్ మైండ్ వివరించాడు. బ్రూగ్స్ జైలుకు తరలించేందుకు ముందు బ్రస్సెల్స్ అధికారులు చేపట్టిన విచారణలో నిందితుడు అబ్దెస్లామ్ పారిస్ దాడి ఘటనతో పాటు ఆ రోజు తమ ప్లాన్ ఏంటన్నది చెప్పాడని తెలుస్తోంది. ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న పారిస్ అంతర్జాతీయ స్టేడియం, రాక్ బ్యాండ్ ప్రదర్శన వద్ద, బాతాక్లాన్ థియేటర్‌లతో పాటు.. పలు కెఫేలపై విచక్షణారహితంగా తూటాలు, బాంబులతో బీభత్సం సృష్టించినట్లు ఒప్పుకున్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paris attack  suspect arrest  Salah Abdeslam  suicide bomber  

Other Articles