Movie Madness killed Abhay in Hyderabad

Movie madness killed abhay in hyderabad

Sai, Abhay, Hyderabad, Murder, 10th class student murder, Abhay Murder

In the Sensational Abhay murder case in Hyderabad, police reveal killer movie madness. Accuse Sai was mad for movies.

సినిమా పిచ్చి... అభయ్ హత్యకు కారణం!

Posted: 03/21/2016 07:32 AM IST
Movie madness killed abhay in hyderabad

సినిమాల్లో నటించాలన్న కోరిక, ఈజీగా మనీ సంపాదించాలన్న ఆశ.. ముగ్గురు జీవితాలను కటకటాల వెనక్కు నెట్టింది. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన టెన్త్ విద్యార్ధి అభయ్ కిడ్నాప్, హత్యకేసులో పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. 48 గంటల్లో కేసును చేధించిన పోలీసులు విస్మయ పరిచే వాస్తవాలను తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన శేషు ఆలియాస్ సాయి, శ్రీకాకుళానికి చెందిన రవవి, మోహన్ ఓ సినిమా ప్రభావంతో అభయ్ ను కిడ్నాప్ చేశారు. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన నటుడి ద్వారా సినిమాలపై ఆసక్తి పెంచుకున్న సాయి.. సినిమాల్లోకి వెళ్లేందుకు భారీగా డబ్బు కావాలని అనుకున్నాడు.. ఎవరినైనా కిడ్నాప్ చేసి భారీగా డబ్బు డిమాండ్ చేయాలని డిసైడ్ అయ్డు. రవి, మోహన్ సాయం తీసుకున్నాడు. యూట్యూబ్ లో ఒక రొమాంటిక్ క్రైమ్ అనే మూవీ చూసి.. అందులోని పాత్రల ప్రభావంతో కిడ్నాప్ డ్రామాకు తెరతీశారు.

ఇలా కిడ్నిప్ చేసిన సాయి అభయ్ దగ్గరి నుండి అతడి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు తీసుకొని కిడ్నాప్ విషయం చెప్పారు. డబ్బులు డిమాండ్ చేశాడు. అయితే అభయ్ కూడా తన తల్లిదండ్రులు డబ్బులు ఇస్తారనే అన్నాడు. . అభయ్ అరుస్తాడేమోనని భయపడిన శేషు, అతని స్నేహితులు.. ముఖానికి ప్లాస్టర్ వేశారు. కానీ ముక్కుకు కూడా ప్లాస్టర్ వేయడంతో ఊపిరాడక అభయ్ చనిపోయాడు. దీంతో కంగారుపడ్డ నిందితులు.. మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. మొత్తానికి సినిమాల పిచ్చి ఓ కడ్నాప్ కు చివరకు ఓ హత్యకు దారి తీసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai  Abhay  Hyderabad  Murder  10th class student murder  Abhay Murder  

Other Articles