set back to ysrcp mla roja in high court division bench

Shock to ycp mla roja set back in high court

high court, supreme court, Assembly, Speaker, yanamala ramakrishnudu, kodela shiva prasadrao, High Court, suspension petititon, roja, YSRCP,, privileges committee, ap legislative assembly, ysrcp mlas, chevireddy bhaskar reddy, rk roja, yanamala ramakrishnudu, kotamreddy sridhar reddy, jyothula nehru, kodali nani

Shock to YSRCP MLA RK Roja as division bench supports government advocate general sayings that assembly is supreme than judiciary

హైకోర్టులో ఎమ్మెల్యే రోజాకు చుక్కెదురు.. సింగిల్ బెంచ్ తీర్పు కోట్టివేసిన ధర్మాసనం

Posted: 03/22/2016 12:36 PM IST
Shock to ycp mla roja set back in high court

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే అర్కే రోజాకు చుక్కెదురైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రాష్ట్రోన్నత న్యాయస్థానం డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. తనను నిబంధనలకు విరుద్దంగా తనను ఏడాది పాటు సస్పెన్షన్ చేశారని.. రోజా దాఖలు చేసిస పిటీషన్ పై సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ కోట్టివేసింది. శాసనాలను తయారు చేసిన అసెంబ్లీ దే పైచేయి అంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది పివీ రావు విషయాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది.

దీంతో ఎమ్మెల్యే రోజాకు అసెంబ్లీలోనికి వెళ్లడానికి మార్గాలు మూసుకుపోగా, సింగిల్ బెంచ్ వద్ద మాత్రం ఇంకా ప్రోసీడింగ్స్ కోనసాగే అవకాశం వుంది. అయితే దీనిపై కూడా రిట్ పిటీషన్ ను స్వీకరించిన న్యాయస్థానం ప్రభుత్వాన్ని వారం రోజుల వ్యవధిలోపు కౌంటర్ పిటీషన్ ను దాఖలు చేయాలని కోరింది. అయితే టెక్నికల్ గా తనను 340 (2) సెక్షన్ కింద ఏడాది పాటు సస్పెండ్ చేయడంపై రోజా తరపు న్యాయవాది డివిజన్ బెంచ్ ముందు వాదనలు వినిపించారు.

కాగా టెక్నికాలిటీస్ కు అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, టెక్నికాలిటీస్ విషయంలో తప్పు దోర్లిందని స్వయంగా ప్రభుత్వమే స్పష్టం చేసిందని డివిజన్ బెంచ్ తెలిపింది. సెక్షన్ 340 (2) క్లాస్ ప్రకారం కాకుండా సెక్షన్ 194 క్లాస్ (3) ప్రకారం అమెను సస్సెండ్ చేశారని.. అయితే సెక్షన్ ఏది అన్న దాని కన్నా అసెంబ్లీలో రోజాను సస్పెండ్ చేయడానికి దారి తీసిన పరిణామాలు, అమె వాడిన అసభ్య పదజాలం, అసెంబ్లీ వ్వవహారాలలో అమె నిత్యం జోక్యం చేసుకుని వాటిని సజావుగా సాగనీయకుండా అడ్డుపడిందన్న ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలను సమర్ధించింది హైకోర్టు డివిజన్ బెంచ్.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles