high tension arose at hcu, police allowing only students and staff into university

Hyderabad central university declares holidays to students

high alert, hyderabad central university, kanhaiah kumar, rohith vemula, ambedkar students association, vc appa rao, JNU row, cpi narayana, Umar Khalid, Anirban Bhattacharya

holidays declared as jnu students leader kanhaiah kumar arriving to hyderabad central university up to 27th of this month.

కన్హయ్య రాకతో ఖంగుతిన్న హెచ్ సీ యు వీసి.. 27 వరకు సెలవుల ప్రకటన

Posted: 03/23/2016 03:52 PM IST
Hyderabad central university declares holidays to students

విద్యార్థుల జీవితాలతో అటలాడుకోవడం అలావాటుగా మారిందని అభియోగాలను ఎదుర్కోంటున వైస్ చాన్స్‌లర్ అప్పారావు రాకతో.. రోహిత్ వేముల ఘటన తరువాత గత రెండు మాసాలుగా ప్రశాంతంగా వున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్కసారిగా మళ్లీ మొదలయ్యాయి. వీసి అప్పారావుపై అణగారిన వర్గాల వ్యతిరేకని అని విద్యార్థి సంఘాలు అరోపిస్తున్నాయి. 2003లో ఆరుగురు ఎస్సీ విద్యార్థుల రస్టికేషన్ కు బాధ్యుడు అప్పారావేనన్న అరోపణలు కూడా వున్నాయి. అప్పట్లో ప్రతిపక్షంలోని కాంగ్రెస్ పార్టీ వేసిన కమిటీ ఇక్కడకు వచ్చి విద్యార్థులకు మద్దతు ప్రకటించింది.

అయితే కాకతాళీయంగా అప్పుడు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతుంది. మళ్లీ ఇన్నాళ్లకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పారావు మళ్లీ వీసీగా వచ్చిరాగానే అంబేద్కర్ విద్యార్థి సంఘం నాయకుడు రోహిత్ వేములతో పాటు మరో ఐదుగురు విద్యార్థులపై వేటు వేయడం.. దీంతో ఆందోళన కొనసాగిస్తూ రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదుగురి విద్యార్ధులపై వున్న సస్సెన్సన్ ను మేనేజ్ మెంట్ రద్దు చేసింది.

అప్పటి నుంచి రెండుమాసాల సుదీర్ఘ సెలవుపై వున్న వీసీ అప్పారావు.. మళ్లీ బాధ్యతలు తీసుకునేందుకు వచ్చిన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగ్యాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం ఆంక్షలను కఠిన తరం చేసింది. యూనివర్సిటీకి ఈనెల 27వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. యూనివర్సిటీలోకి మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, బయటి విద్యార్థులు, వేరే విద్యార్థి సంఘాల నేతలకు సైతం అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు బలగాలు యూనివర్సిటీలో మోహరించాయి. యూనివర్సిటీ మెయిన్ గేట్ను మాత్రమే తెరచి కేవలం యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నామని యాజమాన్యం వెల్లడించింది.

మరోవైపు జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత  కన్హయ్యకుమార్ హెచ్‌సీయూ వచ్చి అంబేద్కర్ విద్యార్థి సంఘం నేతలతో మాట్లాడుతారని ఆ తరువాత స్థానికంగా ఓ సభ నిర్వహిస్తారని వార్తలు రావడంతో ఇటు యూనివర్సిటీ మేనేజ్ మెంట్ తో పాటు అటు కేంద్ర మానవ వనరుల శాఖ ఖంగు తిన్నిందని, అందుచేతే హుటాహుటిన మళ్లీ అప్పారావుకు వీసీ బాద్యతలు చేపట్టాల్సిందిగా ఆదేశించిందని దాంతోనే ఉన్నపలంగా అప్పారావు బాధ్యతలు చేపట్టినట్టు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో కన్హయ్యను సెంట్రల్ యూనివర్సిటీకి రానీయకుండా అడ్డుకునే పనులలో వీసి పూర్తిగా నిమగ్నమయ్యాడు. కన్హయ్య హెచ్ సీయూ కు వస్తే.. ఇప్పటికే అందోళన చేస్తున్న విద్యార్థులకు మరింత బలం చేకూరే అవకాశముందుని, అదే జరిగితే స్థానికంగా అవాంఛనీయ ఘటనలు జరగవచ్చనని ముందుజాగ్రత్త చర్యలతో విశ్వవిద్యాలయం యాజమాన్యం విద్యార్థులకు సెలవులను ప్రకటించింది. కన్హయ్య కుమార్ సభకు కూడా విద్యార్థులు ఎవరూ యూనివర్సిటీలో వుండకుండా వైస్ చాన్స్లర్ అప్పారావు చర్యలు తీసుకున్నారు. అటు, రోహిత్ తల్లి నేడు హెచ్సీయూలో దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో హెచ్సీయూలో పరిస్థితి టెన్షన్ టెన్షన్గా మారింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles