supreme court to hear mla roja case on friday

Supreme court takes up mla rk roja suspension case

high court, supreme court, Assembly, Speaker, YSRCP MLA RK Roja, MLA RK Roja, yanamala ramakrishnudu, kodela shiva prasadrao, High Court, suspension petititon, roja, YSRCP,, privileges committee, ap legislative assembly, ysrcp mlas, chevireddy bhaskar reddy, rk roja, yanamala ramakrishnudu, kotamreddy sridhar reddy, jyothula nehru, kodali nani

YSRCP MLA RK Roja challenges division bench judgement in her one year suspension issue in supreme court, apex court to hear on friday

ఎమ్మెల్యే రోజా పిటీషన్ ను స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం

Posted: 03/29/2016 07:10 PM IST
Supreme court takes up mla rk roja suspension case

హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నగరి నియోజకవర్గ ప్రజల తరుపున గెలిచిన తనను తన నియోజకవర్గ ప్రజల సమస్యను అసెంబ్లీలో వినింపించకుండా ప్రభుత్వం ఏడాది పాటు సస్పెండ్ చేసిందన్న పిటీషన్ పై సింగల్ జడ్జీ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకోవడాన్ని అమె అత్యున్నత న్యాయస్థానంలో  సవాల్ చేస్తున్నారు.

ఈ మేరకు ఇవాళ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించాలని చీఫ్ జస్టిస్ ఎదుట రోజా తరఫు న్యాయవాది వాదించారు. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అవసరం ఉందని, తన సమస్యలను ఎమ్మెల్యే సుప్రీంకోర్టుకు వివరించారు. దీంతో రోజా పిటిషన్ పై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. వచ్చే శుక్రవారం ఎమ్మెల్యే రోజా పిటిషన్ ను విచారించనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం వెల్లడించింది.

ఈ సందర్భంగా రోజా అత్యున్నత న్యాయస్థానం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను గానీ, ఆ పేరును గానీ ప్రజలు గుర్తుంచుకోవడం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదల కానివ్వకుండా, ఆడనివ్వకుండా ఇనుప పాదంతో తొక్కేస్తున్నారని మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు తన పప్పుసుద్ద కొడుకు లోకేశ్ ఎదగలేడన్న భయంతో.. ఎన్టీఆర్‌ను తొక్కేశారని విమర్శించారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలన్నింటికీ చంద్రబాబు తూట్లు పొడిచారని ఆమె అన్నారు. అలాంటి వాళ్లకు టీడీపీ జెండా ఎగరేసే హక్కుందా అని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ సమైక్యాంధ్రకు కట్టుబడి, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడితే, ఈయన మాత్రం కాంగ్రెస్‌తో జతకలిసి రాష్ట్రాన్ని విడదీశారని చెప్పారు. ఎన్టీఆర్ సంపూర్ణ మద్యనిషేధం విధిస్తే, చంద్రబాబు మాత్రం బెల్టుషాపులతో మద్యాన్ని పొంగిస్తూ ఆడపడుచుల జీవితాలు నాశనం చేస్తున్నారన్నారు. ఆయన సిద్ధాంతాలు, ఆశయాలకు సమాధి కట్టేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్ మీద బాబుకు ఎంత కక్ష ఉందో స్పష్టంగా తెలుస్తుందంటూ పలు విషయాలు వివరించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో మంచినీళ్లను చవగ్గా అందిస్తామన్నారని, కానీ అవి రాష్ట్రంలో నాలుగైదు చోట్ల కూడా లేవని చెప్పారు.

అన్న క్యాంటీన్లు అంటూ ఆర్భాటంగా ప్రకటించి రెండేళ్లయినా.. ఇప్పటికీ ఒక్కటీ పెట్టలేదన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవ అని పేరు మార్చారని.. కానీ గత సంవత్సరం 350 కోట్లు, ఈ సంవత్సరం 450 కోట్ల బకాయిలతో ఆ పథకానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరుమీద ఉన్న పథకాలన్నింటినీ నిర్వీర్యం చేశారని, అదే తన పేరు మీద ఉన్న చంద్రన్న కానుకకకు మాత్రం అడ్డదిడ్డంగా నిధులిస్తూ అందులో అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. ఇప్పుడున్నది తెలుగుదేశం పార్టీ కాదు.. తెలుగు దొంగల పార్టీ అని రోజా విమర్శించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles