ABP News-Nielsen Opinion Poll: Mamata Banerjee to retain power in West Bengal

Mamata banerjee ser to retain power in west bengal says opinion polls

amit shah, mamata banerjee, west bengal election 2016, ravidranath tagore, BJP, Congress, Trunamul congress, Cpi(M), Cpi, rahul gandhi, sonia gandhi, West Bengal, Trinamool Congress, TMC, Mamata Banerjee, Buddhadeb Bhattacharya, Bengal polls, ABP News-Nielsen Opinion, Assembly elections 2016, West Bengal Assembly elections 2016,

Mamata Banerjee-led Trinamool Congress is set to return to power in West Bengal by winning 178 seats and getting an increased vote share compared to 2011 assembly elections.

అమె తంత్రం ముందు అమిత్ మంత్రాలు పారవట..

Posted: 03/30/2016 03:22 PM IST
Mamata banerjee ser to retain power in west bengal says opinion polls

పశ్చిమ బెంగాల్ వాసులు మరోమారు తమ దీదీ పాలననే కోరుకుంటున్నారు. మూడు దశాబ్దాల పాటు ఏకచక్రాధిపత్యంగా కొనసాగిన వామపక్షాల పాలన నేపథ్యంలో టాటాలకు, అప్పటి ప్రభుత్వ పారిశ్రామిక విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించి ప్రభుత్వ పగ్గాలను అందుకున్న మమతా బెనర్జీ.. ఈ సారి ఎన్నికలలో అంతకంటే మెరుగైన ఫలితాలతో మరోమారు అధికార పీఠాన్ని అధిరోహించనుందని ఓపీనియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. వామపక్షాలు మరో సారి ప్రతిపక్ష హోదాలో కూర్చోక తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

గత ఎన్నికలలో కేవలం 39 శాతం ఓట్లతో 190 స్థానాలను సంపాదించుకుని అధికారంలో వున్న తృణముల్ కాంగ్రెస్, ఈ సారి ఏకంగా 45 శాతం ఓట్లను పొందనుందని ఏబిపి, నిల్సన్ ఓఆర్జీ సర్వే వెల్లడించింది. అయితే గత ఫ్రిబవరి మాసంలో నిర్వహించిన సర్వేకు, మార్చిలో నిర్వహించిన సర్వేకు పెద్దగా తేడాల ఏమీ లేదని, అయితే షెడ్యూలు విడుదలతోనే ప్రచార బరిలోకి దిగిన మమత.. గత మాసానికి, ఈ మాసానికి ఓక్క శాతం ఓట్లను పెంచుకుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక ఈ ఎన్నికలలో నమో మంత్రం, వ్యక్తి పూజ, కేంద్ర ప్రభుత్వ అభివృద్ది పనులు, ఏమీ కూడా పనిచేయడం లేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీదీ తంత్రం ముందు అమిత్ మంత్రాలు పారడం లేదన్న వార్తలు వినబడుతున్నాయి. బీజేపి కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే ఆర్జిస్తుందని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికలలోనూ బీజేపి ఒక్క స్థానాన్ని సంపాదించింది. కాగా, గత ఎన్నికలలో 4.5 శాతం వున్న ఓట్లు ఈ సారి 5శాతానికి పెరిగే అవకాశాలు వున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

గత ఎన్నికలలో తృణముల్ కాంగ్రెస్ తో జతకట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి ప్రతిపక్ష లెఫ్ట్ పార్టీతో జతకట్టింది. ఈ సారి రాష్ట్ర ఎన్నికల బరిలో తాము ఒంటరిగానే దిగుతామని మమతా బెనర్జీ సంకేతాలచ్చి.. అ దిశగా అడుగులు వేయడంతో.. కాంగ్రెస్, వామపక్షాలతో జతకట్టి.. ఎన్నికల బరిలోకి దిగాయి. అయితే ఈ కూటమికి ఈ సారి గత ఫలితాలే ఎదురవుతాయని స్పష్టమవుతుంది. వామపక్షాలకు గత ఎన్నికలలో 57 స్థానాలు రాగా, కాంగ్రెస్ కు 38 స్థానాలు లభించాయి. అయితే కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, వామపక్షాలు ఈ ఎన్నికలలో కేవలం 110 స్థానాలు మాత్రమే వస్తాయని ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : West Bengal  Trinamool Congress  TMC  Mamata Banerjee  Buddhadeb Bhattacharya  Bengal polls  

Other Articles