తోమ్మిది వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా.. తన ఆస్తుల వేలాన్ని నిలిపివేయాలని అందుకు అనుగూణంగా తాము బ్యాంకులతో చర్చలు సాగిస్తున్నట్లు విజయ్ మాల్యా తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. మొత్తం రూ. 9 వేల కోట్ల వరకు అప్పులు ఉండగా వాటిలో రూ. 4 వేల కోట్లను సెప్టెంబర్‌లోగా చెల్లిస్తానని విజయ్ మాల్యా ఆఫర్ చేశారు. దాంతో బ్యాంకుల కన్సార్షియం ఈ ప్రతిపాదనకు స్పందించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.
కింగ్ ఫిషర్, యునైటెడ్ బ్రూవరీస్ లాంటి పలు వ్యాపారాలతో ఒక వెలుగు వెలిగిన విజయ్ మాల్యా.. ఆ తర్వాత పూర్తిగా అప్పులపాలై వ్యాపారాలన్నింటినీ దాదాపు వదులుకున్నారు. యునైటెడ్ బ్రూవరీస్ యాజమాన్యాన్ని కూడా వేరే విదేశీ సంస్థకు అప్పగించారు. వివిధ బ్యాంకులకు రూ. 9వేల కోట్ల వరకు బకాయి పడటంతో అతడిని దేశం వదిలి వెళ్లనివ్వకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం సుప్రీంను ఆశ్రయించినా, అప్పటికే ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. తాజాగా ఈ ప్రతిపాదన చేశాడు.
అయితే మాల్యా ప్రతిపాదనపై బ్యాంకులు కొంచెం అలోచించి నిర్ణయం తీసుకోవాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మాల్యా చేస్తున్నది వన్ టైం సెటిల్ మెంట్ అయితే మాత్రం బ్యాంకులు ఆ ప్రతిపాదనను తిరస్కరించాలన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. విజయ్ మాల్యా తరహాలోనే అనేక మంది పారిశ్రామిక వేత్తలు అదే బాటలో పయనిస్తున్నారని, వారందరూ కూడా మాల్యా తరహాలోనే కోర్టులను ఆశ్రయించి.. మాల్యా ఘటనను ఉదాహరణగా పేర్కోంటూ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేత వేసే అవకాశముంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అదే సమయంలో తాను చేసిన రుణాలకు కావాలంటే తనను తిట్టుకోవాలి గానీ, తన అబ్బాయిని మాత్రం ఏమీ అనొద్దని విజ్ఞప్తి చేశాడు. వివిధ బ్యాంకులకు రూ. 9వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సిన మాల్యా ఇక్కడి నుంచి ఇంగ్లండ్ పారిపోయిన విషయం తెలిసిందే. తన కొడుకు సిద్దార్థ మాల్యాను ఈ వివాదంలోకి లాగొద్దని అన్నాడు. తన కొడుకు సిద్ మీద అనవసరంగా ద్వేషభావం చూపొద్దని, తిట్లు తిట్టొద్దని తెలిపాడు. అతడికి తన వ్యాపారంతో ఏమాత్రం సంబంధం లేదని, మీకు తప్పనిసరి అయితే తన మీద తిట్ల వర్షం కురిపించాలి గానీ అతడిమీద కాదని అన్నాడు. కావాలంటే తనను ఏమైనా అనొచ్చు గానీ కుర్రాడిని ఎందుకని ట్వీట్ చేశాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more