అవినీతి ఎక్కడున్నా దానిని నిర్మూలిస్తాం.. అవినీతి రహిత పాలనే మా ధ్యేయం, ఏ రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి వచ్చినా.. అక్కడ ఏ రూపంలోనూ అవినీతి లేకుండా చేస్తామని హామీలు గుప్పిస్తున్న బీజేపి వాస్తవానికి మాత్రం హామీలను అమలు పర్చడంలో వెనుకంజలోనే వుంది. నేతి బీరకాయలో నెయ్యిలా, మైసూర్ బోండాలో మైసూరలా బీజేపి హామీలు వున్నాయని పెద్ద ఉదాహరణే అశోక్ ఖేమ్కా. ఈయన ఎవరో్ అనుకుంటున్నారు కదూ.. పేరు మాత్రం ఎక్కడో విన్నట్లుంది అంటున్నారా. ఆయన అవినీతిపరుల పాలిట సింహస్వప్నం.
హర్యానా రాష్ట్రంలో అవినీతి రాజకీయ నేతల గుండెల్లో నిద్రపోయిన సీనియర్ ఐఏఎస్ అధికారిక అశోక్ ఖేమ్కా. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారు అధికారంలో ఉండగానే ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణాన్ని ఖేమ్కా వెలికితీసాడు. దీంతో ఆయన పేరు ఒక్కసారిగా జాతీయ రాజకీయాలలో నానింది. ఖేమ్కా వాద్రా కుంభకోణాన్ని భయటపెట్టిన నేపథ్యంలో ఆయనకు బీజేపీ నేతలు సైతం అండగా నిలబడ్డారు. కానీ, అదే బీజేపీ నాయకులు అధికారంలోకి రాగానే ఖేమ్కాను విస్మరించారు,
ఇప్పటికే 22 ఏళ్ల సర్వీసులో 46 సార్లు బదిలీ అయిన అశోక్ ఖేమ్కాకు తగిన ఉన్నత పదవిని అప్పగిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు గతంలో ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రిత్వ కార్యాలయం నుంచి ఆయనకు పిలుపు కూడా వచ్చింది. ఆ తర్వాత ఏందుకో పిలుపుకు సంబంధిచిన ఆనవాళ్లు కూడా కనిపించలేదు, ఏకంగా జాతీయస్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్దమైన ఖేమ్కా.. ఇక దానిపై చడీచప్పుడూ కూడా లేకపోవడంతో తన అలవాటుగా వేచిచూడటం చేసాడు, ఈ తరుణంలో ఆయనను మళ్లీ తన సొంత కేడర్ అయిన హర్యానాకే పరిమితం కావాల్సి వచ్చింది.
అయితే మూడు నెలల క్రితం ఆయనకు ముఖ్య కార్యదర్శి హోదా ఇస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసిన హర్యానా ప్రభుత్వం, ఆయనకు పదోన్నతి కూడా కల్పించింది, సరిగ్గా జనవరి 1న ఉత్తర్వులైతే జారీ అయ్యాయి, కానీ అప్‌గ్రేడేడ్ పోస్టు మాత్రం ఆయనకు కేటాయించలేదు. దీనిపై ఖేమ్కా తన ట్విట్టర్ ఖాతాలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోషన్ దక్కినా, మూడు నెలలుగా తక్కువ హోదా కలిగిన పోస్టులోనే కొనసాగిస్తున్న ప్రభుత్వం తనను అవమానపరుస్తోందని, తన పరిస్థితి ఎలా ఉందంటే, ఒక లెఫ్ట్‌నెంట్ జనరల్ స్థాయి అధికారి బ్రిగేడియర్ స్థాయి పదవిలో ఉన్నట్టుగా ఉందని మనస్సులోని బాధను వెల్లడించారు.
అయితే ఖేమ్కా నిజాయితీకి అండగా నిలచిన బీజేపి నేతలు, ప్రభుత్వాలు ఇప్పుడు ఆయన నిజాయితీకి జంకుతున్నారా..? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి, తన పంథా తనదే అన్నట్లుగా అవినీతికి వ్యతిరేకంగా నడిచే అధికారితో ప్రభుత్వ లోసుగులు ఎక్కడ బయటపడతాయోనన్న భయం కూడా అధికార వర్గాలకు ఉందని విమర్శలు వినబడుతున్నాయి, మరి ఇప్పటికైనా హర్యానా ప్రభుత్వం స్పందిస్తుందో, లేక ప్రధాని నరేంద్రమోడీ స్పందిస్తారో లేదో వేచి చూడాలి మరి..!
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more