Future of Two Wheeled Transport-C-1 from LIT Motors

This incredible bike can never be knocked down

self-balancing bike,San Francisco-based Lit Motors,motorcycle-specific parking,Lit Motors,Incredible Bike,fully-enclosed C-1 bike, gyroscopes, LIT motors, mode of transportation, motorcycle, passion of bike riding, pollution created by vehicles during the peak hours, powered by electricity, san francisco, suv, usa, Technology News

LIT motors formed in 2010 with its base in San Francisco, USA has developed the prototype of C-1 was a single seater, fully enclosed powered by electricity.

ITEMVIDEOS: వావ్.. ఎంతకీ కిందపడని బైక్.. కారు ప్రయాణంలా సాగిపోతుంది

Posted: 04/01/2016 06:37 PM IST
This incredible bike can never be knocked down

బైక్ డ్రైవింగ్ అంటే ఇష్టపడని వారుండరు. అయితే ఒంటిరి డ్రైవింగ్ బోర్ కోట్టినప్పుడు మాత్రం తోడుగా వెనకన ఎవరైనా వుంటూ బాగుంటుందని అనిపించడం మామూలు, అయితే అలా ఎవరూ లేకపోయినా కారులో వున్నట్లు చిన్నపాటి స్పీకర్. దాంట్లోంచి పాటలు వినబడే సౌలభ్యం వుంటూ ఎంతో హ్యాపీ. ఇక ఇప్పటి కుర్రకారుకు కావాల్సినట్టుగా గంటకు వంద కిలోమీటర్ల స్పీడ్ వెళ్లే విధంగా వర్షంలోనూ, ఎండలోనూ ప్రయాణించే అవకాశం వుంటే అబ్బో, అబ్బో చాలు ఇక చాలు అంటారా.. కానీ ఇది వాస్తవం, త్వరలోనే ఈ బైక్ అందుబాటులోకి వస్తుంది,

అయితే ఫెట్రోల్, డిజీల్ ఏ వేరియంట్ అని అడగాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ బైక్ ఎలక్రిక్ బైక్, ఒక్కసారి చార్జింగ్ పెడితే 200 కిలోమీటర్ల దూరం వెళ్తుంది, ఇక కాలుష్యం సమస్యే లేదు కాబట్టి దీనికి పోలుష్యన్ నియంత్రణ సర్టిఫికెట్ కూడా అవసరం ఉండదు, ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ బైక్ దానంతట అదే బాలెన్స్ చేసుకుంటుంది, అంతే కాదు ఎలాంటి పరిస్థితుల్లోనూ కిందపడే అవకాశమే లేదు. ఈ బైక్ కింద పడనీయకుండా ఒకవైకు కాసింత వంగగానే అటోమేటిక్ స్టాండ్ దానంతట అదే బయటకు వస్తుంది,

ఎవరు తయారు చేశారంటే..
శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన లిట్ మోటార్స్ సంస్థ ఈ బైక్‌ను తయారు చేసింది. దీనికి ‘సీ-1’ అనే పేరు కూడా పెట్టింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది దానికదే బ్యాలెన్స్ చేసుకుంటుంది. దీనిని నడిపేవారు కారులో కూర్చున్నట్లుగా లోపలే కూర్చుంటారు. ట్రాఫిక్ నిలిచిపోయినా, ఏదైనా అడ్డువచ్చినా ఈ బైక్‌ను మనం ప్రత్యేకంగా బ్యాలెన్స్ చేయాల్సిన పనిలేదు. కాస్త వంగితే చాలు దానిలో దాగున్న స్టాండ్ బయటకు వచ్చేస్తుంది.

ఇక లోపల మాత్రం కారులో ఉండే సదుపాయాలన్నీ ఈ బైక్‌లో ఉన్నాయట.
 
 *    ఇది 100 శాతం విద్యుత్‌తో నడుస్తుంది.
 *    గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు.
 *    ఒకసారి చార్జింగ్ చేస్తే దాదాపు 200 మైళ్లు ఆగకుండా సాగిపోవచ్చు.
 *    కేవలం అరగంట చార్చింగ్ చేస్తే చాలు.
 *    కేవలం 6 సెకన్లలో 0 నుంచి 60 ఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది.
 *    ట్రాఫిక్‌లో రయ్‌మంటూ దూసుకుపోయేలా నాజూగ్గా రూపొందించారు.  
 *    పైగా దీనిని బైక్‌ను పార్కింగ్ చేసినంత స్థలంలోనే పార్‌‌క చేయవచ్చు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles