Vangaveeti Mohana Ranga Statue Demolished at Machilipatnam

Telugu content

Vangaveeti Mohana Ranga, congress Ex MLA, vangaveeti ranga statue, tensions in machalipatnam, ranga statue demolished, vangaveeti radha, kapu leaders protest,

Tensions erupted at Machilipatnam in Krishna district on Sunday morning with unidentified miscreants demolishing a statue of Vangaveeti Mohana Ranga.

వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం, నిందితులను అరెస్టు చేయాలని రాధా డిమాండ్

Posted: 04/03/2016 12:40 PM IST
Telugu content

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నిజాంపేట కూడలి వద్ద వున్న దివంగత నేత వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని గుర్తుతెలియని దుండుగులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. దీంతో కాపు సంఘాల నేతలు రంగా విగ్రహం వద్ద ఆదివారం ధర్నాకు దిగారు. దోషులను కఠినంగా శిక్షించాలని కాపు నేతలు ఆందోళన చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. డాగ్ స్వాడ్ ను రంగంలోకి దింపి నిందితులను కనిపెట్టే పనిలో వున్నారు పోలీసులు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు రంగా విగ్రహం ఉన్న ప్రాంతంలో ప్రభుత్వం భారీగా పోలీసులను రక్షణగా నిలిపింది.

కాగా, తన తండ్రి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తేలికగా వదిలిపెట్టబోమని వంగవీటి రాధా వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని సందర్శించిన ఆయన, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాధా రాకతో నిజాంపేట ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించిన అనంతరం రాధా మాట్లాడుతూ, కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. విగ్రహం ధ్వంసం జరుగుతుంటే, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణం నిందితులను పట్టుకోకుంటే తన స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు మచిలీపట్నంలో కాపు సంఘం నేతల నిరసనలు కొనసాగుతున్నాయి.    

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles