Saritha Nair letter says Oommen Chandy sexually abused her

Saritha nair accuses chandy of sexually abusing her

Saritha Nair, Oommen Chandy, sexually abuse, kearala, chief minister, solar scam

Kerala chief minister dismissed the allegations as attempts to dislodge government on eve of polls. He said that the big lobby which is trying to derail the government was behind the present controversy.

ఆ సీఎం నన్ను లైంగికంగా వేధించాడు.. సరితా నాయర్

Posted: 04/04/2016 09:30 AM IST
Saritha nair accuses chandy of sexually abusing her

కేరళ రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన సరితా నాయర్ కు సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై తీవ్రమైన ఆరోపణలతో ఆమె రాసిన లేఖ తాజాగా ఓ మీడియా ప్రసారం చేయడంతో రాష్ట్ర రాజకీయాలలో మరోమారు కలకలం రేగింది. తనను ఊమెన్ చాందీ లైంగికంగా వేధించారని ఆమె రాసిన లేఖ ప్రతిని ఆసియన్ నెట్ న్యూస్ ఛానల్ వెలుగులోకి తెచ్చింది. 2013, మార్చి 19న రాసినట్టుగా చెబుతున్న ఈ లేఖలో సంచలనాత్మక విషయాలున్నాయి.

ఊమెన్ చాందీతో పాటు కేంద్ర మాజీ మంత్రి తనను లైంగికంగా వేధించారని లేఖలో సరిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి లంచం కూడా ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ లేఖను అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కు ఆమె ఇవ్వాలనుకున్నారు. ముఖ్యమంత్రి చాందీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. చాందీ కుమారుడు తనను వేధింపులకు గురిచేశారని గతంలో ఆమె ఆరోపించారు. ఈ లేఖ తనదేనని సరితా నాయర్ తెలిపారు.
 
సరితా నాయర్ లేఖ మరోమారు వెలుగు చూడటంపై కోట్టాయంలో స్పందించిన ముఖ్యమంత్రి వూమెన్ చాంధీ ఇది రెండో ఎడిషన్ గా ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనపై పథకం ప్రకారం కుట్ర చేశారని చాందీ ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని దించడానికి చివరి ప్రయత్నంగా దీన్ని వర్ణించారు. రాష్ట్రంలోని కొందరు బారు యజమానులు ఈ కుట్రల వెనుక వున్నారని చెప్పిన ఆయన వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. సరితా నాయర్ తన కూతురులాంటిందని ఆయన చెప్పుకోచ్చారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saritha Nair  Oommen Chandy  sexually abuse  kearala  chief minister  solar scam  

Other Articles