RK Roja suspension case, supreme to hear today

Sc to hear rk roja suspension case today

high court, supreme court, Assembly, Speaker, yanamala ramakrishnudu, kodela shiva prasadrao, High Court, suspension petititon, roja, YSRCP,, privileges committee, ap legislative assembly, ysrcp mlas, chevireddy bhaskar reddy, rk roja, yanamala ramakrishnudu, kotamreddy sridhar reddy, jyothula nehru, kodali nani

Supreme Court division bench to start hearing on YSRCP MLA RK Roja suspension case petition today

అర్కే రోజా సస్సెన్షన్ కేసు.. ఇవాళ విచారించనున్న సుప్రీంకోర్టు

Posted: 04/04/2016 09:33 AM IST
Sc to hear rk roja suspension case today

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే అర్కే రోజా దాఖలు చేసిన పిటీషన్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరపనుంది. తాను అసెంబ్లీకి హాజరు కావచ్చునని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ అమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. రోజా గత నెల 29న పిటిషన్ దాఖలు చేయగా ముందుగా ఈ నెల 1న విచారణ జరుపుతామని చెప్పిన న్యాయస్థానం.. ఆ రోజున విచారణ సమయం మించిపోవడంతో ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది,

తనను నిబంధలనలకు విరుద్దంగా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సస్సెండ్ చేశారని అమె తన పిటీషన్ లో పేర్కోన్నారు. అసెంబ్లీలో ప్రజల తరఫున గట్టిగా గొంతు వినిపించేందుకు ప్రయత్నిస్తే ఆ గొంతును నొక్కేయాలన్న అధికార పక్షం అడ్డకుంటుందని, తన నగరి నియోజకవర్గం ప్రజలకు న్యాయం చేయాలని కూడా అమె తన పిటీషన్ లో పేర్కోన్నారు. తనను ఏడాది పాటు సస్సెండ్ చేసే అధికారం అధికార పక్షానికి లేదని తప్పుడు సెక్షన్ల కింద తనను ఏడాది పాటు సస్పెండ్ చేశారని అమె పిటీఫన్ లో న్యాయస్థానానికి విన్నవించారు.

తన వాదనలతో ఏకీభవించిన సింగిల్ బెంచ్ న్యాయస్తానం తనను అసెంబ్లీకి హాజరుకావాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులను టీడీపీ ప్రభుత్వం, అసెంబ్లీ ధిక్కరించాయి. తనను అసెంబ్లీలోనికి అడుగు పెట్టనీయకుండా గేట్ వద్దే మార్షల్స్ తో తనను అడ్డుకుందని అరోపించారు. కాగా డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రోజా అత్యున్నత న్యాయస్థానాన్ని అశ్రయించారు. దీనిపై ఇవాళ న్యాయస్థానం విచారణ జరపనుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles