దేశశ రాజధానిలో నిర్భయ ఘటన వెలుగుచూసిన తరువాత ఇలాంటి అకృత్యాలకు వ్యతిరేకంగా అందోళన నిర్వహించిన యువత నిందితులందరినీ అరెస్టు చేసి.. నిర్భయ పేరున నూతన చట్టం, ఈ కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇత్యాధులను కల్పించినా.. అలాంటి ఘటనలు క్రమంగా దేశంలో పెరుగుతూనేపోతున్నాయి తప్ప.. తగ్గుముఖం పట్టకపోవడంపై విదేశాలు సైతం అందోళన వ్యక్తం చేశాయి. భారత్ లో మనస్సు దోచే పర్యాటక ప్రాంతాలు అనేకం వున్నా.. ఆ ప్రకృతి సోయగాలను అస్వాదించేందుకు మాత్రం వెళ్లరాదని తమ దేశ ప్రజలకు అనేక విదేశాలు సూచించాయి.
ఈ సూచనలు చేసి సుమారుగా నాలుగేళ్లు కావస్తున్న తరుణంలో స్సెయిన్ దేశానికి చెందిన ఓ యువ జంట భారత్ దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంలోని పుష్కర్ ప్రాంతాన్ని సందర్శించాలని రాజస్థాన్ కు వచ్చారు. ఇక్కడి ఓ హోటల్ లో దిగిన జంట, బైక్ ను అద్దెకు తీసుకుని వ్యాహ్యాళికి వెళ్లి అక్కడి పర్యాటక ప్రాంతాలను అస్వాదించి, తిరిగి బయటకు వస్తున్న వారికి మద్యం మత్తులో జోగుతున్న అగంతకులు తారసపడ్డారు. పర్యాటకులను అడ్డకున్న తాగుబోతులు ఆక్కడ వీరంగం సృష్టించారు.
విదేశీ వనితపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారు. అమె బట్టలు చించి అత్యాచారానికి యత్నించారు. అయితే వారి దురాగతాన్ని పసిగట్టిన అమె పరుగుపరుగున స్నేహితుడి వద్దకు వెళ్లి అతన్ని పిలుచుకువచ్చింది, అతడిపై అగంతకులు రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. గాయాలపాలైన వారిని హోటల్ మేనేజర్ అజ్మీర్ ఆసుపత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర భయాందోళనలో ఉన్న ఆమె స్టేట్ మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదని, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కాగా, మద్యంతాగిన కొందరు స్థానికులు స్పెయిన్ జంట పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు ఎస్పీ నితిన్ దీప్ చెప్పారు. విదేశీయులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ, వారి వెంటపడినట్టు తెలిపారు. విదేశీ మహిళను వేధించినట్టు సమాచారం. బాధితులు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి స్నేహితుడిని పిలిచారు. స్థానికులు విదేశీయులతో గొడవపడి దాడి చేశారు. ఈ దాడిలో ఓ యువకుడు గాయపడ్డాడు. అతని తలకు గాయాలయ్యాయి. గాయపడ్డ స్పెయిన్ యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన నిందితుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ చెప్పారు.
అయితే ఇలాంటి ఘటనలు దేశం పరువున విదేశాలలో కూడా తీసిపారుస్తాయని, ఇలాంటి ఘటనలను ఎదుర్కోన్న పర్యాటకులు వారి దేశానికి వెళ్లి మన దేశం గురించి ఎంత నీచంగా చెప్పుకుంటారో కూడా అలోచించాల్సిన అవసరం వుంది. భారత్ మాతాకీ జై అని నినదిస్తేనే దేశానికి, భారతమాతకు గౌరవమని భావించే నేతలు.. ఇలాంటి ఘటన వల్ల మన భారతమాత పరువును మనమే బజారుపాలు చేస్తున్నామన్నది గ్రహించక తప్పదు. దేశానికి వచ్చిన అతిధులతో అమర్యాదగా వ్యవహరించరాదన్నది వాస్తవం.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more