Modi order to enquire on Panama Papers pronounced persons

Modi order to enquire on panama papers pronounced persons

Modi, Panama, Panama Papers, India, Black money

Modi order to enquire on Panama Papers pronounced persons. Narendra Modi gave instructions to higher autorities on Panama paper details.

పనామా మీద మోదీ విచారణ

Posted: 04/05/2016 01:12 PM IST
Modi order to enquire on panama papers pronounced persons

నల్ల కుబేరుల జాబితాను వెల్లడించి పనామా పేపర్స్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. పనామా పేపర్స్ పేరుతో నల్లకుబేరుల పేర్లను దాదాపు కోటి ఇరవై లక్షల డాక్యుమెంట్లతొ బట్టబయలు చేసింది పనామా పేపర్స్. మన దేశంలొ న్యు ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేపర్ తో కలిసి దాదాపు 2000 మందితో మన దేశానికి సంబందించిన నల్ల కుబేరుల వివరాలను సేకరించింది పనామా పేపర్స్. వాటిని నిన్నటి నుండి ప్రచురిస్తోంది. దేశ అధ్యక్షుల దగ్గరి నుండి సినిమా స్టార్స్ వరకు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇలా అందరికి సంబందించిన వివరాలను పనామా పేపర్స్ వెల్లడిస్తోంది. ఇండియాలో దాదాపు 500 మంది నల్ల కుబేరుల పేర్లను పనామా పేపర్స్ బయట పెట్టింది.

పనమా పేపర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన నల్ల కుభేరుల జాబితాలో వివిధ దేశాధ్యక్షులు, సినీ స్టార్స్, వ్యాపారదిగ్గజాలతో పాటు 500 మంది భారతీయులు వుండటం కలకలం సృష్టిస్తోంది. బిగ్ బి అమితాబ్ తో పాటు ఆయన కోడలు ఐశ్వర్యారాయ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నివేదిక వెల్లడి భారత్ కు శుభపరిణామమని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అధికారులకు కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విదేశాల్లో నల్లధనం దాచుకున్న 500 మంది భారతీయులపై విచారణ చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. పనామా పేపర్స్ పేరుతో బయటపడ్డ సంపన్నుల అక్రమ లావాదేవీలను వెలికి తీసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Panama  Panama Papers  India  Black money  

Other Articles