India may make security clearance norms stricter for Chinese companies

After masood unsc snub india to hit back at chinese investments

Narendra Modi, China, Pakistan, Pathankot terror attack, Jaish-e-Mohammed (JeM), Maulana Masood Azhar, Indian security agencies, Nuclear Security Summit (NSS), JeM, Chinese Security firms, India China ties, UN sanctions on JeM

The Indian security establishment is mulling revoking the liberal security clearance regime for Chinese companies after the Dragon blocked India's proposal to impose sanctions on Jaish-e-Mohammed (JeM) chief Maulana Masood Azhar in the United Nations.

ఆ బంధం బలపడి. భారత్ పై విషం కక్కుతున్నాయి..

Posted: 04/05/2016 04:24 PM IST
After masood unsc snub india to hit back at chinese investments

భారత్ వంటి పవిత్రమైన కర్మభూమి, ధర్మభూమిని చూసి.. దినదిన ప్రవర్తమానంగా నానాటికీ ఎదుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేని పోరుగు దేశాలు బంధాన్ని పెనవేసుకున్నాయి. ఈ తరుణంలో ఒక దేశం ఉగ్రవాదాన్ని పోత్రహిస్తుంటే.. భారత్ పైకి ఉసిగోల్పుతుండగా, మరో దేశం ఉగ్రవాదులను రక్షించడంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తుంది. భారత్ పాక్ సరిహద్దులలో కాల్పుల ఉల్లంఘనలకు కాలుదువ్వుతున్న పాకిస్థాన్.. అక్రమ చోరబాట్లను, ఐఎస్ఐ సహకారంలో దేశంలో అలజడులను సృష్టిస్తుందన్నది జగమెరిగిన సత్యం.

అయితే గతంలో ఒంటరిగానే తుంటరి చేష్టలకు పాల్పడిన పాకిస్థాన్.. గత కొంతకాలంగా డ్రాగన్ దేశం సాయాన్ని తీసుకుని తనకు తానే బలవంతుడన్న రీతిలో రెచ్చిపోతుంది. చైనా సహకారంతోనే నియంత్రణ రేఖలో చేపట్టకూడని చర్యలకు కూడా చైనా చేపట్టి భారత్ పై కాలుదువ్వుతుంది. పలు సందర్భాలలో చైనా కవ్వింపులను సహనంతో పరిష్కరించిన భారత్ తాజాగా పలు సందర్భాలలో ఈట్ కా జవాబ్ పత్తర్ అన్నట్లు చైనాకు ధీటుగా బదులు ఇవ్వడానికి సరిహద్దులో బలగాలను మోహరించడంతో చైనా తోకముడిచింది.  

భారత్ ధీటుగా జవాబిచ్చిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న చైనా.. ఇటు సముద్ర తీరం నుంచి దేశంలోని పలు కీలక ప్రాంతాలపై రహస్యంగా నిఘాను కూడా పెట్టిన విషయాన్ని గ్రహించింది భారత్. అంతటితో బుద్ది తెచ్చుకోని చైనా భారత్ పై తన ఉక్రోషాన్ని వెల్లగక్కుతూనే వుంది. అంతర్జాతీయ జలాల విషయంలో సముద్ర తీరంలోని పోరుగు దేశాలను కలుపుకుని సంఘటితంగా వ్యవహరించాలని భారత్ నేతృత్వంలో తీర్మాణించడం కూడా చైనాకు మింగుడు పడటం లేదు. దీంతో భారత్ పై మరింత కసి పెరిగి కుట్రలు, కుత్రంతాలు పన్నాలని యోచించింది.

ఏకంగా ఉగ్రవాదన్ని పరోక్షంగా ప్రోత్సహించేందుకు కూడా సిద్దమైంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ చీఫ్ మసూద్ అజార్‌పై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించకుండా చైనా అడ్డుకుంది. ఆయన ఉగ్రవాది అని చెప్పడానికి గల సాక్ష్యాలు లేవంటూ.. తన వద్దనున్న విటో అధికారంతో అంక్షలు వర్తించకుండా అడ్డుకుంది, అయితే దీనిపై భారత్‌ ఆగ్రహంగా ఉంది. ఈ విషయంలో చైనాకు తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో చైనా పెట్టుబడులకు అనుమతించే విషయమై కేంద్రం పునరాలోచన చేయవచ్చునని సమాచారం.

దేశంలో చైనా పెట్టుబడులకు భద్రతా అనుమతులు ఇచ్చే విషయంలో కేంద్రం పునరాలోచన చేయడమంటే.. ఐరాసలో చైనా చర్యకు దీటుగా బదులు ఇవ్వడమేనని అధికార వర్గాలు చెప్తున్నాయి.  పఠాన్‌కోట్‌ ఉగ్రవాద దాడితోపాటు భారత్ వ్యతిరేక చర్యలు చేపడుతున్న అజార్‌ను అంతర్జాతీయంగా నిషేధించాలని భారత్‌ చాలాకాలంగా కోరుతోంది. అయితే చైనా అడ్డుకోవడంతో తీవ్ర అసంతృప్తి చెందిన భారత్.. అర్థికభారంతో సతమతమవుతున్న చైనాను భారతీయ విఫణీలో బుద్ది చెప్పాలని భావిస్తుంది.

'చైనా సంస్థల తయారీ ఉత్పత్తులను భారతీయ విఫణిలో అడ్డుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇరుదేశాల మద్య కుదిరిన దౌత్య సంబంధాల నేపథ్యంలో అధికారికంగా కాకపోయినా.. కనీసం సామాజిక మాధ్యమాలతోనైనా.. చైనా ఉత్పత్తులను అడ్డుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని సోషల్ మీడియాలో భారతీయులు కోడై కూస్తున్నారు. చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసి వారిని ఆర్థికంగా మనం అదుకుంటుండగా, వారు మాత్రం మన దేశంలో ఉగ్రవాదాన్ని పెంచుతున్న వారిని రక్షిస్తున్నారని నెట్ జనులు మండిపడ్డుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Masood Azhar  JeM  Chinese Security firms  India China ties  UN sanctions on JeM  

Other Articles