రుణాలను పోందాలనుకునే వారికి ఇది శుభవార్త, ముఖ్యంగా ఇంటి నిర్మాణ, కొనుగోలు రుణాలను తీసుకోవాలని భావిస్తున్న వారికి, కారు కొనుగోలు రుణాలను పొందాలనుకుంటున్న వారికి ఇది నిజంగా శుభవార్తే, ఎందుకంటే ఆర్బీఐ రుణ గ్రహితలపై పడే వడ్డీని పావు శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు శుభవార్త అందించే క్రమంలో ఆర్బీఐ. గృహ, కారు రుణాలకు మేలు చేకూరేలా కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూ ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.
ప్రతీ మూడు నెలలకో పర్యాయం ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆధ్వర్యంలోని కమిటీ ద్రవ్య పరపతి సమీక్షను నిర్వహించే వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది, అందులో భాగంగా ఇవాళ సమీక్షించిన కమిటీ రెపో రేటును 25 బేసిక్ పాయంట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది, దీంతో రెపో రేటు 6.75 బేసిక్ పాయింట్ల నుంచి 6.50 పాయంట్ల వద్ద నిలిచింది, కాగా రివర్స్ రెపో రేటును కూడా 25 బేసిక్ పాయింట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది, అయితే నగదు నిష్పత్తి నిల్వలను మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా నాలుగు శాతం వద్ద కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది,
ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీ రేట్లకే గృహ, వాహన రుణాలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకునే రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన రాజన్, ఆర్బీఐ దగ్గర ఉంచే నగదు నిల్వలపై వడ్డీరేట్లను పావు శాతం పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించారు. అంచనాల కనుగుణంగానే రెపో రేటు ను పావు శాతం తగ్గించిన రాజన్ రివర్స్ రెపోను పావు శాతం పెంచి విశ్లేషకులను ఆశ్చర్యపరిచారు. రాజన్ తీసుకున్న ఈ నిర్ణయంతో వినియోగదారులకు రుణాలివ్వడానికి మరిన్ని నిల్వలు తక్కువ వడ్డీకి అందుబాటులోకి రానున్నాయి. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు అందేలా బ్యాంకులు వెంటనే చర్యలు చేపట్టాలని రాజన్ ఆదేశించారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more