దేశంలో ఉగ్రవాద దాడులు జరిగేందుకు తమ సహాయ సహకారాలను అందజేసిన పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ (ఐఎస్ఐ) నేతృత్వంలోని పాకిస్థాన్ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్(జిట్)ను బృందాన్ని దేశంలోని అడుగుపెట్టనీయకూడదంటూ ఆది నుంచి వ్యతిరేకిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేంద్రంలోని అధికార నరేంద్రమోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి దర్యాప్తు చేపట్టిన జిట్ ను యావత్ ఎఫిసోడ్ అంతా భారత్ అడించిన నాటకమని చెప్పడంపై ఆయన తన స్వరాన్ని తీవ్రతరం చేశారు.
పఠాన్ కోట్ విషయంలో మోదీ సర్కార్ తీరును అరవింద్ కేజ్రీవాల్ తూర్పారబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు కలిసి భారతమాతకు వెన్నుపోటు పొడిచారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది యావత్ దేశానికే సిగ్గుచేటని భారతమాతకు ఎనలేని అవమానం జరిగిందని అన్నారు. ప్రధాని మోదీ పాకిస్థాన్ ముందు దేశాన్ని అవమానపర్చారని ఆయన మండిపడ్డారు. ఇంతకు ముందున్న దేశ ప్రధానులు ఎవరూ చేయలేనంత అవమానం భారతమాతకు నరేంద్రమోడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఓ వైపు భారత్ మాతాకీ జై కొట్టాలని నినదిస్తుండగా, మరోవైపు ఆదే పార్టీకి చెందిన అగ్రనేతలే భారత మాతకు వెన్నుపోటు పొడుస్తున్నారంటూ తన ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు కేజ్రీవాల్. జిట్ నివేదిక బయటకు రాకముందే అందులో ఏముందో పాకిస్థాన్ మీడియా వెల్లడించడం, పఠాన్ కోట్ దాడికి పాల్పడింది పాక్ కాదు ఇండియానే అనే ప్రేలాపనలు పేలడం లాంటి పరిణామాలపై కూడా ఆయన ధ్వజమెత్తారు, ఈ ఘటనలన్ని మోదీ అసమర్థత వల్ల కలిగినవేనని విమర్శించారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more