Tomb’ of principal appears in Victoria college on the day of her retirement

Tomb of principal appears in victoria college on the day of her retirement

Kerala, Principal, Victoria college, Principals tomb

On the day of her retirement last week, the principal of a Kerala college found a symbolic grave meant for her, set up in front of the college building. Days later, the issue has blown up into a controversy, with fingers being pointed and a case registered against those responsible.

కాలేజ్ లో ప్రిన్సిపాల్ సమాధి.. బ్రతికి ఉండగానే

Posted: 04/06/2016 12:43 PM IST
Tomb of principal appears in victoria college on the day of her retirement

కేరళలోని పలక్కాడ్‌లో గల ప్రభుత్వ విక్టోరియా కళాశాలలో గత మార్చి 31న ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కళాశాల విద్యార్థులు బతికుండగానే ప్రిన్సిపాల్‌కు సమాధి కట్టారు. వివరాల్లోకి వెళితే… విక్టోరియా ప్రభుత్వ కాలేజీకి గత ఎనిమిది నెలల నుంచి ప్రిన్సిపాల్‌గా సరసు విధులు నిర్వహిస్తున్నారు. అయితే మార్చి 31న ఉదయం కళాశాలకు వచ్చిన ఆమెకు ఓ వింత సంఘటన ఎదురైంది. కాలేజీ ఆవరణలో ఒక సమాధి కట్టబడి ఉంది. దాంతో పక్కనే నిల్చున్న విద్యార్థిని ఇది ఎవరి సమాధి అని ఆమె అడిగారు. విద్యార్థి చెప్పిన సమాధానం విన్న ప్రిన్సిపాల్ షాక్ తింది.

ఆ విద్యార్థి ఏమాత్రం తడుముకోకుండా మీదే అంటూ సమాధానం ఇవ్వడంతో ప్రిన్సిపాల్ నిర్ఘాంతపోవల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఘటనపై ఆమె విచారించగా… హాస్టల్ విద్యార్థులు ఆ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో సమాధి తీసినట్టు తెలిసింది. ఈ ఘటనకు కారణమైన విషయాన్ని సరసు తెలుపుతూ.. తరగతుల బహిష్కరణకు, నిరసన తెలిపేందుకుగాను ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులకు అనుమతి ఇవ్వలేదని, దాంతో విద్యార్థులు తనకు వీడ్కోలు బహుమతిగా ఘోరి ఇచ్చారన్నారు. ఈ ఘటనలో విద్యార్థులతోపాటు లెఫ్ట్ పార్టీలతో అనుబంధమున్న కొందరు టీచర్ల ప్రమేయం కూడా ఉన్నట్లు ప్రిన్సిపాల్ అనుమానం వ్యక్తం చేశారు. సరసు ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యార్థులపై పరువు నష్టం కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Principal  Victoria college  Principals tomb  

Other Articles