అత్యంత ప్రమాదకారిగా మారిన జికా వైరస్ ను ఎట్టకేలకు వైద్య పరిశోధకులు చేధించారు, భ్రూణహత్యలకు కారణమయ్యే ఈ వైరస్ తన ప్రభావాన్ని అత్యంత వేగంగా విస్తరించడంతో పాటు చాటుతుందని, ముఖ్యంగా గర్బిణీ స్త్రీల పాలిట ఇది యమపాశంలా తయారైందని ఆందోళన చెందిన వైద్య బృందం గత కొంతకాలంగా అనేక పరిశోధనలు సల్పుతూ ఎట్టకేలకు దాని గుట్టును కనుక్కోగలిగారు, అయితే ఈ బృందంలో భారతీయ వైద్యురాలు దేవికా సరోహి కూడా ఉండటం గమనార్హం, దీంతో అమెకు ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి,
‘‘దేవిక సిరోహి... మీకు అభినందనలు. మీరు మీ కుటుంబం మాత్రమే కాకుండా, యావత్తు దేశం గర్వపడే విజయం సాధించారు’’ అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. జీకా వైరస్‌ను విశ్లేషించిన అమెరికా బృందంలో మీరట్‌కు చెందిన దేవిక సిరోహి (29) సభ్యురాలు. జీకా వైరస్‌ను విశ్లేషించి, దాని నిర్మాణాన్ని వివరించడంలో ఈ బృందం విజయం సాధించిన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ దేవికను ప్రశంసించారు. మీరు సాధించిన విజయం వల్ల బాలికా విద్యకు ఉన్న ప్రాధాన్యం స్పష్టంగా వెల్లడవుతోందన్నారు. బాలికలను రక్షించడంపైనా, బాలికలను చదివించడంపైనా మన దృష్టి ఉండాలన్నారు.
అయితే రాజ్ నాథ్ సింగ్ తో పాటుగా దేశవ్యాప్తంగా అమెకు ప్రశంసలు అందుతున్నాయి, ముఖ్యంగా అమె క్లాస్ మెట్లు, మిత్రులతో పాటు ఉపాధ్యాయులు, పరిచయస్తులు అందరూ అమె సాధించిన విజయాన్ని అభినందిస్తున్నారు, జీకా వైరస్ నిర్మాణ క్రమాన్ని వివరించిన బృందంలో ఉన్న నలుగురు విద్యార్థుల్లో దేవిక ఒకరు. ఈ బృందం ఇచ్చిన వివరణ వల్ల జీకా వైరస్ ద్వారా వచ్చే వ్యాధికి చికిత్సను కనుగొనడానికి అవకాశం ఉంటుంది. ఈ వైరస్ ప్రస్తుతం 38 దేశాల్లో వ్యాపించింది. దీని నివారణకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప్రాజెక్టులను ఇండియాతో సహా ఐదు దేశాలు చేపట్టాయి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more