Parents Confront Docs as Runaway Techie Undergoes Height Gain Surgery

Row over height lengthening surgery at hyderabad global hospital

Global hospitals surgery, Nikhil Reddy operation, hospital in trouble, nikhil, global hospital, surgery, height increasing, Hyderabad, Corporate Hospital, lakdikapul

A 23-year-old techie, who ran away from home three days ago, taking Rs.4 lakh in cash, was found undergoing treatment at a corporate hospital to enhance his height.

కాసుల కక్కుర్తి.. కార్పోరేట్ వైద్యుల ధనదాహనికి పరాకాష్ట

Posted: 04/06/2016 02:34 PM IST
Row over height lengthening surgery at hyderabad global hospital

మహానగరంలో మాయగాళ్లతో జాగ్రత్తా అని నగరానికి వచ్చే ప్రతీ పౌరుడికి ఇంటికాడ అమ్మ, నాన్న అన్నదమ్ములు చెబుతుంటారు. మహానగరంలో మాయగాల్లు అనేకం. ఎవరు ఏ రూపంలో నిన్న వంచిస్తారో.. నీ అమాయకత్వాన్ని ఏ విధంగా వాళ్లు వాడుకుంటారో తెలియదు, దాంతో నీవెన్ని ఇబ్బందులు పడుతావో.. ఎన్ని కష్టాలు చవిచూడాల్సి వస్తుందోనని కంగారు వారిది. అయితే ఇలాంటి ఓ అమాయకుడైన సాప్ట్ వేర్ ఇంజనీర్ తో ఏడాది కాలంగా సంప్రదింపులు జరిగిన ఓ కార్పోరేట్ అసుపత్రి వైద్యుడు.. ఏకంగా అతడ్ని మూడించుల పోడుగు చేస్తామని నమ్మబలికి సర్జరీ చేసిన వైనం వెలుగుచూడటంతో కలకలం రేగింది.

కార్పోరేట్ ఆసుపత్రుల ధనదాహం పరాకాష్టకు చేరిందనడానికి ఈ ఘటనే ఉదాహరణ. కాసుల కోసం కక్కుర్తి పడుతున్న డాక్టర్లు అడ్డదారులు తొక్కుతూ వారి జేబులు నింపుకుంటున్నాు. రోగి పడే బాధను, అతనికి నిర్వహించే శస్త్ర చికిత్సపై కనీసం వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించే చర్యలు తీసుకోవడం లేదు. వైద్యశాస్త్రంలోనే లేని అపరేషన్లు చేస్తామని అమాయకులను నమ్మించి వారి నుంచి అందిన మొత్తం తీసుకుని వైద్యం చేస్తున్నారు.

మనిషి తన వారసత్వంగా పెరిగే ఎత్తుతో పాటు శారీరక వ్యాయామాల ద్వారా పెరిగే హైట్ ను కూడా వదలకుండా సోమ్ము చేసుకుంటున్నారు గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు, ఇలాంటి వైద్యుల మాటలను పూర్తిగా విశ్విసంచిన నిఖిల్ రెడి అనే సాప్ట్ వేర్ ఇంజనీర్.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హైట్ పెరగాలన్న ఆత్రుతో గ్లోబల్ ఆస్పత్రికి చేరుకోగా అతడి రెండు కాళ్లకూ శస్త్రచికిత్స చేయడం వివాదాస్పదంగా మారింది. ఎత్తు పెరగడం మాటేమోగానీ... ఆ యువకుడు ఆరు నెలలపాటు బెడ్‌పైనే, మరో మూడు నెలలు చక్రాల కుర్చీలోనే ఉండాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఆవేదన నింపుతోంది.

బోయిన్‌పల్లిలో నివాసముండే వ్యాపారి గోవర్ధన్‌రెడ్డి రెండో కుమారుడు నిఖిల్‌రెడ్డి (22). బంజారాహిల్స్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. 5.7 అడుగుల ఎత్తున్న నిఖిల్‌కు ఇంకా ఎత్తుగా ఉండాలని బలమైన కోరిక. దీంతో కాళ్ల పొడవు పెంచే శస్త్రచికిత్స కోసం కొంత కాలంగా గ్లోబల్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్యుడు చంద్రభూషణ్‌ను సంప్రదిస్తున్నాడు. చివరికి ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు ‘లింబ్ లెన్త్ నీ విత్ లింబ్ రీ కనస్ట్రక్షన్ (మోకాలు, కింద ఎముక పునర్నిర్మాణం)’ శస్త్రచికిత్స చేయించుకునేందుకు సిద్దమయ్యాడు.

ఈ నెల 3న అర్ధరాత్రి ఇంట్లోంచి వచ్చేసి, సోమవారం ఉదయం ఆస్పత్రిలో చేరాడు. తమ కుమారుడికోసం గాలించిన తల్లిదండ్రులు.. సోమవారం పేట్‌బషీర్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు మంగళవారం రోహిత్ సంతకం తీసుకుని శస్త్రచికిత్స ప్రారంభించారు. అయితే బంధువులు నిఖిల్ సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా గాలించి.. అతను గ్లోబల్ ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుసుకున్నారు.

తీరా అస్పత్రి వద్దకు చేరుకోగానే విషయం తెలిసిన  కుటుంబసభ్యులు డాక్టర్లను నిలదీయగా, నిఖిల్ మేజర్ ని సమాధానం ఇచ్చారు, ఇక ఇది మడికో లీగల్ కేసు కూడా కాదు కాబట్టి పోలీసులకు కూడా విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదని అస్పత్రి వర్గాలు నిసిగ్గుగా చెబుతున్నాయి. సాధారణంగా ప్రమాదాలు జరిగినపుడు ఎముకలు విరిగిన పేషెంట్లకు మాత్రమే ఇలాంటి శస్త్రచికిత్సలు చేస్తారు. కానీ క్రమంగా ఎత్తు పెంచేందుకు ఇలాంటి సర్జరీలు చేస్తున్నారు. ఈ శస్త్రచికిత్స ప్రమాదకరమని వైద్యులు చెబబుతున్నారు.

అయితే ఆసుపత్రి వర్గాల నుంచి వచ్చిన సమాధానంతో రోగి బంధువులు కూడా పలు ప్రశ్నలను గుప్పిస్తున్నారు. ఇలా ఎంత మందికి ఎన్ని రకాలుగా సర్జరీలు చేశారని, ఎంత డబ్బు సంపాదించారని వారిని నిలదీస్తున్నారు. ఎవరైనా డబ్బులిస్తే వైద్యం చేసేస్తారా..? రేపు ఎవరో ఒకరు తమ బందువని అతని అవయవాన్ని తీసి తమ కుటుంబసభ్యులకు అమర్చాలని వస్తే కూడా ఎలాంటి విచారణ లేకుండా అమరుస్తారా..? అయినా రోగికి సదరు శస్త్రచికిత్స చేసే ముందు దాని నుంచి ఎదరయ్యే సమస్యలను కూడా వివరించాల్సిన ధర్మం వైద్యులపై వుంది.

అతడు వినని పక్షంలో అతని కుటుంబసబ్యులకైనా విషయాన్ని చెప్పాలని వైద్యుల ప్రధమ సూత్రమని, అంతేకాని డబ్బులోస్తే చాలు అన్నట్లు వ్యవహరించి గ్లోబల్ అస్పత్రి వైద్యులు వైద్యరంగానికే కళంకాన్ని తీసుకోచ్చారని మండిపడుతున్నారు. వైద్యో నారాయణో హరి అని దేవుళ్లతో సమానంగా వైద్యులను ఆరాధిస్తే.. వైద్యులు మాత్రం ధనం మూలం ఇదం జగత్ అని వ్యవహరించడం సిగ్గుచేటని బందువులు విమర్శిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : nikhil  global hospital  surgery  height increasing  Hyderabad  Corporate Hospital  lakdikapul  

Other Articles