telangaa govt decided to fill Gurukula posts

Telangaa govt decided to fill gurukula posts

Telangana, Gurukula, POsts, Jobs, Gurukula Teachers

Telangana Govt decided to fill all vaccancies in Telangana GUrukula Vidyalayas. Govt give propose to TSPSC. TSPSC will announce notificvation soon.

తెలంగాణ గురుకులాల్లో 2444 పోస్టుల భర్తీ

Posted: 04/07/2016 06:00 AM IST
Telangaa govt decided to fill gurukula posts

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. గురుకుల విద్యాలయాల్లో 2 వేల 444 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చింది. వీటిని TSPSC ద్వారా భర్తీ చేయాలని డిసైడైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో.. త్వరలోనే భర్తీ ప్రక్రియ మొదలు పెట్టేందుకు TSPSC చర్యలు తీసుకోనుంది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో.. 60 మైనారిటీ గురుకుల స్కూళ్లు ప్రారంభించాలని రీసెంట్ గా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి కోసం అవసరమైన 630 పోస్టులను కలిపి.. ఈ రిక్రూట్ మెంట్ లోనే భర్తీ చేయాలని డిసైడైంది.

సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో 758.. బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో 307.. ప్రభుత్వ గురుకులాల్లో 313.. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 436.. మైనారిటీ వెల్ఫేర్ గురుకులాల్లో 630.. మొత్తంగా 2 వేల 444 పోస్టులు భర్తీ చేయాలని డిసైడైంది. డీఎస్సీతో 10 వేల టీచర్ పోస్టుల భర్తీ చేస్తామంటున్న ప్రభుత్వం.. టెట్ నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. మరోవైపు.. గ్రూప్ 2 కింద ఇప్పటికే 439 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నిరుద్యోగులు, రాజకీయ నేతల నుంచి అభ్యంతరాలు రావడంతో.. మరిన్ని పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ నెలలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం.. కొత్తగా 700 పోస్టులు కలిపి.. మొత్తంగా వెయ్యి గ్రూప్ 2 పోస్టులు రిక్రూట్ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Gurukula  POsts  Jobs  Gurukula Teachers  

Other Articles