Washington DC burger thief makes dinner while robbing a Five Guys

Hungry crook breaks into five guys to make himself a burger

burger thief, Washington D.C. Police, Five Guys Burgers, burglar, Surveillance video, thief entering a Five Guys restaurant, delivery person

A man busted into a Five Guys patty joint, casually grilled up a few burgers, grabbed a bottle of water, and fled — and cops are now asking the public to help catch-up to the hungry thief.

ITEMVIDEOS: బర్గర్ దొంగను పట్టిస్తే.. అక్షరాలా 65 వేల రూపాయల బహుమానం..

Posted: 04/12/2016 11:03 AM IST
Hungry crook breaks into five guys to make himself a burger

దొంగల్లో వెరైటీ దొంగలు ఉంటారనడానికి ఈ దొంగగారే నిదర్శనం. తనకు పట్టలేనంత అకలి వేసిందో లేక నిజంగానే బర్గర్ తినాలని కోరిక పుట్టిందో తెలియదు. అయితే బహుశా డబ్బలు లేని కారణంగా అనుకుంటా దొంతతనమైనా చేసి బర్గర్ తినాలని నిర్ణయానికి వచ్చేశాడు ఓ దొంగ గారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలోని ప్రముఖ ఫైవ్ గయ్స్ అనే బర్గర్ రెస్టారెంట్ ను టార్గెట్ చేసుకున్నాడు. అంతే అప్పటికప్పుడు ఓ ప్రణాళికను రచించుకున్నాడు, రెస్టారెంట్ మూసివేసే సమయంలో బర్గర్ డెలివరీ బాయ్ ని అనుసరించి రెస్టారెంట్ లోకి వచ్చిన దోంగ అతను రెస్టారెంట్ నుంచి వెళ్లిపోయేంత వరకు వేచి వున్నాడు.

డెలివరి బాయ్ అలా వెళ్లగానే ఆ బర్గర్ ఆ షాపులోకి కిచెన్ లోకి దూరాడు. అయితే క్యాష్ కౌంటర్ సహా ఏ ఇతర ప్రాంతంలోకి వెళ్లని దోంగ కేవలం కిచన్ లోకి వెళ్లి మటన్, బన్ ముక్కలను తీసుకుని ఇక తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. అర్థరాత్రి మూడు గంటల నుంచి తెల్లవారు జామున ఐదు గంటల వరకు రెస్టారెంట్ లోనే గడిపిన దోంగ.. సుమారు రెండు గంటల పాటు రెస్టారెంట్ లోనే వున్నాడు. ఇంట్లో వండుకున్నంత దర్జాగా డబుల్ చీస్ మటన్ బర్గర్ ను వండుకుని అరగించాడు.

ఆ తరువాత అదే రెస్టారెంట్ లోని వాటర్ బాటిల్ ను కూడా తీసుకుని నీళ్లు తాగిన తరువాత దర్జాగా వెళ్లిపోయాడు.ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ టీవీ పుటేజ్ లో రికార్డైంది. దీనిని చూసిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి చిత్రమైన దొంగతనాన్ని మన దేశంలో అయితే లైట్ తీసుకునేవారేమో కానీ, అక్కడ మాత్రం అలా వదిలెయ్యలేదు. అతని పుటేజ్ ను మీడియాకు విడుదల చేసిన పోలీసులు అతనిని పట్టిచ్చిన, లేదా అనవాళ్లు తెలిపిన వారికి అక్షరాలా వెయ్యి డాలర్లు (మన కరెన్నీలో67 వేల రూపాయల) నజరానా ఇస్తామని ప్రకటించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles