Kerala HC bans noise-generating fireworks at places of worship in state post sunset

Kerala high court bans fireworks at night in all places of worship

Kerala temple tragedy, Kerala fireworks ban, Puttingal Devi temple, Kerala High Court, Puttingal Devi temple fire tragedy, kerala HC bans fire works

The Kerala High Court banned bursting of firecrackers in all places of worship in the state between sunset and sunriset after Puttingal Devi temple fire tragedy.

సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు బాణాసంచా పేలుళ్ల నిషేధం

Posted: 04/12/2016 04:38 PM IST
Kerala high court bans fireworks at night in all places of worship

పుట్టింగల్ ఆలయ అగ్నిప్రమాద ఘటనపై సీబీఐతో దర్యాపు జరపాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపై కేరళ రాష్ట్రంలో శబ్ద కాలుష్యంతో కూడాన బాణాసంచాను నిషేధిస్తూ తీర్పు నిచ్చింది, సూర్యాస్తమం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు బానాసంచాను వినియోగించరాదని అదేశించింది, ముఖ్యంత తమ ఆదేశాలు ప్రముఖ ఆలయాలు, ఫుణ్యక్షేత్రాల వద్ద తప్పని సరిగా వర్తింపజేయాలని అదేశాలను జారీ చేసింది.

కేరళలోని కోల్లం జిల్లాలో పుట్టింగల్ ఆలయం వద్ద జరిగిన అగ్నిప్రమాద దుర్ఘటనపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇకపై బాణాసంచ పేలుళ్లకు కూడా అనుమతులు తప్పనిసరి చేసింది. చట్టవిరుద్ధంగా బాణసంచా పేలుళ్లు నిర్వహించారని న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆలయ ప్రాంగణంలో బాణసంచా కాల్చేందుకు తాము అనుమతి ఇవ్వలేదని హైకోర్టుకు కేరళ ప్రభుత్వం తెలిపింది. అనుమతి ఇవ్వకుంటే బాణసంచా ఎలా కాల్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

అనుమతి లేనప్పుడు ఆలయ ప్రాంగణంలోని బాణసంచాను పోలీసులు ఎందుకు పట్టుకురానిచ్చారని, కాల్పులను ఎందుకు అడ్డుకోలేకపోయారని సూటిగా నిలదీసింది. పేలుళ్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం విధుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టు పేర్కొంది. ఈ ఘోర విపత్తుకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు, కొల్లాం జిల్లా అధికార యంత్రాగం వేర్వేరుగా అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.
పుట్టింగల్ ఆలయ ప్రాంగణంలో ఆదివారం తెల్లవారుజామున బాణసంచా కాల్పులు సందర్భంగా పేలుడు సంభవించడంతో 112 మంది మృతి చెందగా, 300 మందిపైగా గాయపడ్డారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles