Janasena activists welcome pawan desicion to contest 2019 elections

Janasena activists with new josh asks pawan to contest from vijayawada

pawan kalyan eyes on 2019 elections, pavan kalyan plans to begin ground work for janasena, Pawan Kalyan Janasena bus yatra, Pawan Kalyan bus yatra, Janasena Pawan Kalyan updates, AP political news, Janasena begins ground work for 2019 elections, pawan kalyan, jana sena, actor, 2019 elections, bus yatra, pada yatra, politics, janasena party men,

Janasena activists welcome their chief, Pawan Kalyan decesion to contest in 2019 elections, and asks him to contest ffrom vvijayawada.

ITEMVIDEOS: జనసైన్యంలో కొత్త జోష్.. విజయవాడ నుంచి పోటీ చేయాలంటున్న కార్యకర్తలు

Posted: 04/12/2016 02:25 PM IST
Janasena activists with new josh asks pawan to contest from vijayawada

జనంలోకి తమ సేనాని త్వరలో వస్తున్నారని తెలియడంతో జనసేన కార్యకర్తలు, పనవ్ కల్యాన్ అభిమానులలో కోత్త జోష్ నింపింది. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తాను బరిలో నిలుస్తానని, అప్పటి వరకు తాను తన పార్టీని బలోపేతం చేసి, క్షేత్రస్తాయి నుంచి పటిష్టపరుస్తానని చెప్పడంతో జనసేన కార్యర్తలు మళ్లీ యాక్టివ్ గా మారారు, తన సేనాని ఎప్పడు వస్తే అప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్దమవుతున్నారు, పార్టీ స్థాపించిన రెండేళ్ల తరువాత దుర్ముఖీ నామ సంవత్సర ఉగాది సందర్భంగా పవన్ తమకు శుభవార్తనందిచారని పేర్కోంటున్నారు.

తమ అధినేత పవన్ విజయవాడ నుంచే రానున్న ఎన్నికలలో పోటీ చేయాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. జనసేనానిని తాము భారీ మెజారీటీతో గెలిపించుకుంటామని చెప్పారు, ఈ మేరకు ఇవాళ విజయవాడలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కల్యాన్ తాజా ప్రకటనతో ఆయన పార్టీలోకి తరలివస్తున్న బిసీ నేతల సంఖ్య కూడా గణనీయంగానే పెరుగుతుంది. నిన్నమొన్నటి వరకు రాజకీయాలతో సంబంధం లేని బీసి నేతలు, కూడా ఇవాళ జనసేన కండువాలు కప్పుకుని విజయవాడ ప్రెస్ క్లబ్ లో సమావేశం కావడమే ఇందుకు ఉదాహరణ,

పార్టీ ఆవిర్భావం తరువాత జిల్లాల వారీగా జనసేన కార్యవర్గాలు ఏర్పాటు కాగా, ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దిగక పోవడంతో, కార్యకర్తలు సైతం తమ దారిలో తాము వెళ్లిపోయారు. ఇక తాజా పరిణామాలతో పవన్ రాజకీయాల్లోకి వెంటనే రావాలన్న డిమాండ్ పెరుగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ ప్రకటనపై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు మొదలుకాగా, ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో మాత్రం హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ నిర్మాణం కోసం కార్యకర్తలు కూడా బరిలోకి దిగుతామని స్పష్టం చేస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jana sena  actor  2019 elections  bus yatra  pada yatra  politics  janasena party men  

Other Articles