భారత ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూనే.. మరోవైపు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలను తామే ఘనంగా నిర్వహిస్తున్నామని కొందరు బడాయిలకు పోతున్నారని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నవారు, అంబేడ్కర్ సిద్ధాంతాల పట్ల ఏమాత్రం విశ్వాసం లేని వారు ఆయన జయంతులు చేస్తున్నారని మండి పడ్డారు. అంబేద్కర్ జయంతుల ద్వార దళితులను తమ వైపు తిప్పుకోవాలని కేంద్రం యత్నిస్తుందని విమర్శించారు.
పాట్నాలోని జేడీయూ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే వారు అంబేద్కర్ పట్ల అమితమైన గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. బలహీనవర్గాల వారి ఓట్లు దండుకోవడానికే అంబేద్కర్ పేరుతో మోదీ ప్రభుత్వం ప్రజల్లోకి వెలుతోందని.. వారికి బాబాసాహెబ్ సిద్ధాంతం పట్ల ఏమాత్రం విశ్వాసం లేదని విమర్శించారు. ఓట్ల కోసం నటించే నాయకులను ఎంత మాత్రం విశ్వసించరాదని నితీష్ కుమార్ పిలుపునిచ్చారు.
అంబేద్కర్ సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి పోరాటం చేశాడని, బీజేపీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను విడదీయడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని యూనివర్సిటీల్లో దళిత విద్యార్థులు వేధించబడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. వారిని పట్టించుకోకుండా దళితుల ఓట్లకోసం వారి పట్ల ప్రేమను నటిస్తున్నారని ఆరోపించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రం పాత్ర లేని వాళ్లు జాతీయవాదం గురించి విపరీతంగా మాట్లాడుతున్నారని నితీష్ అన్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more