AirAsia offers domestic flights at Rs 999, international at Rs 2,999

Airasia offers rs 999 domestic rs 2999 international fare

AirAsia, discount offer, one-way fare, domestic flights, international networks, Goa, Melbourne, Bali, Bangkok, Delhi, Bengaluru, India, Travel, Tourism, Visakhapatnam, Chandigarh, Guwahati, Imphal, Pune, Jaipur, Kuala Lumpur, Perth, Manila, World

Budget carrier AirAsia is offering discounted one-way fare, starting Rs 999 for travel on its domestic network and fares, starting Rs 2,999 for travel to international networks.

ఎయిర్ ఏషియా బంఫర్ ఆఫర్.. దేశీ, విదేశీ ప్రయాణాలపై..

Posted: 04/18/2016 02:59 PM IST
Airasia offers rs 999 domestic rs 2999 international fare

చౌక ధరలకే విమాన టికెట్లను అందిస్తూ సామాన్యుల చెంతకు విమానయాన ప్రయాణాన్ని తీసుకెళ్తున్న విమాన సంస్థల్లో ఒకటైన ఎయిర్ ఏషియా సంస్థ మరోసారి బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. ఇప్పటికే అనేక విమానయాన సంస్థలు ప్రయాణికులకు అత్యంత తక్కువ ధరలకే విమానయాన అవకాశాన్ని కల్పిస్తూ.. చౌక ధరల యుద్దానికి తెరతీస్తున్న తరుణంలో ఏయిర్ ఏషియా కూడా మరోమారు చవకైన ఆఫర్ ప్రకటించింది.

దేశీయంగా ఉన్న నగరాలకు పన్నులన్నీంటీనీ కలుపుకొని వెయ్యి రూపాయలకు టిక్కెట్ అందజేస్తామని ప్రకటించింది. ఇక విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు మరింత భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది, కేవలం మూడు వేల రూపాయలకే టికెట్లు అందజేస్తామని వెల్లడించింది.. తాము 22 దేశాల్లోని 100 నగరాలకు విమానాలు నడిపిస్తున్నామని, తాము ఇప్పుడు అందిస్తున్న ఈ ప్రమోషనల్ ఆఫర్‌తో దేశ విదేశాలు చుట్టి రావాలనుకునేవారికి మంచి అవకాశం వచ్చినట్లు అవుతుందని ఎయిర్ ఏషియా కమర్షియల్ విభాగం అధిపతి స్పెన్సర్ లీ ఓ ప్రకటనలో పేర్కోన్నారు.

ఈ ఆఫర్ కింద బుకింగ్స్ చేసుకోవాలని అనుకుంటున్నవాళ్లు ఇవాళ్టి నుంచే తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు, ఈనెల 24 వరకు టికెట్లు బుక్ చేసుకునే సౌలభ్యం వుంది. ఈ బంపర్ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకున్న వారు ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం మే 22లోగా ప్రయాణాలు చేసుకోవచ్చు. మన దేశంలో విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, కొచ్చిన్, చండీగఢ్, గోవా, గువాహటి, ఇంఫాల్, పుణె, జైపూర్ నగరాలకు ఆపర్ ప్రయాణాలు అందుబాటులో వుండగా, విదేశాలలో కౌలాలంపూర్, బ్యాంకాక్, బాలి, మెల్‌బోర్న్, పెర్త్, మనిలా లాంటి 100 నగరాలకు రూ. 2,999 టికెట్‌తో వెళ్లొచ్చని ఎయిర్ ఏషియా ప్రకటించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirAsia  discount offer  one-way fare  domestic flights  international networks  

Other Articles