ponguleti sudhakar reddy | resign | congress | party posts | purushotham reddy | sonia gandhi | rahul gandhi | digvijay singh | shabir ali | telangana pcc

Ponguleti sudhakar reddy resigns to all posts of congress

ponguleti sudhakar reddy pouting on Tpcc, ponguleti resigns for congress posts, ponguleti dissatisfaction on pcc, ponguleti, congress, party posts, tpcc chief purushotham reddy, sonia gandhi, rahul gandhi, digvijay singh, shabir ali, telangana pcc

Telangana congress senior leader ponguleti sudhakar reddy resigns to all posts of congress party expressing his dissatisfation in declaring pcc posts

అలకబూనిన పోంగులేటి.. పార్టీ పీసీసీ పదవులకు రాజీనామా..

Posted: 04/20/2016 04:32 PM IST
Ponguleti sudhakar reddy resigns to all posts of congress

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో మంచి వాగ్ధాటి కలిగిన నేతగా, సీనియర్ కాంగ్రెస్ నేతగా వున్న పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్టీపై అలకబూనినట్లు వున్నారు. పార్టీ పిసిసి కార్యవర్గం ఏర్పాటులో సినియర్ నేతనైన తనను సంప్రదించకుండానే జెంబో కార్యవర్గాన్ని ప్రకటించడంపై అయన పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న పొంగులేటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన పదవులన్నింటికీ రాజీనామా చేశారు.  

పీసీసీ కార్యవర్గ, సమన్వయ కమిటీ సభ్యత్వ పదవులకు రాజీనామా చేసిన ఆయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు యువనేత రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ తో పాటుగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీకి ఫ్యాక్స్ ద్వారా పంపారు. పదవుల భర్తీలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని పొంగులేటి ఆరోపించారు.

పీసీసీ పదవుల భర్తీలో మల్లు భట్టి విక్రమార్కను, రేణుకా చౌదరిని మాత్రమే సంప్రదించారని, ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను విస్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం తాము శాయశక్తులా పనిచేస్తున్నా.. తమకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయాని వచ్చారని తెలుస్తుంది. కాగా పార్టీ పదవులకు రాజీనామా చేసే యోచనను విడనాడాలని, ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని షబ్బీర్ అలీ ఈ సందర్భంగా పొంగులేటిని బుజ్జగించినట్లు తెలుస్తోంది. మరోవైపు పొంగులేటి పదవులకు రాజీనామా చేయటం పార్టీలో కలకలం రేపుతోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ponguleti sudhakar reddy  sonia gandhi  rahul gandhi  digvijay singh  shabir ali  telangana pcc  

Other Articles