ఏపికి ప్రత్యేక హోదా కుదరదని తేల్చిన కేంద్రం | No Special Status for Ap

No special status for ap

AP, Special Status, Andhra Pradesh, No Special Status, Modi, NDA, Parliament, మోదీ, ఏపి, ప్రత్యేక హోదా, పార్లమెంట్

Central govt clear that no special Status for Andhra Pradesh. In the Parliament sessions Central Minister Jayanth Sinha clear the situation.

ఏపికి ప్రత్యేక హోదా కుదరదని తేల్చిన కేంద్రం

Posted: 05/04/2016 04:34 PM IST
No special status for ap

ఏపికి కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఏపికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. అంతేకాదు, ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడం కోసం నిబంధనలు సడలించలేమని కూడా కేంద్రఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో ప్రశ్నించిన ఎంపీ అవంతి శ్రీనివాస్‌ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి సిన్హా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన చట్టంలో లేదని, రెవెన్యూ లోటు అంశంకూడా విభజన చట్టంలో లేదని చెప్పుకొచ్చారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రక్రియలో మార్పులు చేసే ప్రతిపాదన లేదని కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా స్పష్టం చేశారు.

పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి అవసరమైనంత మేరకు ప్రత్యేక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నీతిఆయోగ్‌ సిఫార్సులకు అనుగుణంగా ఏపీకి నిధులు మంజూరు చేస్తామన్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2014-15లో 4,403 కోట్లు, 2015-16లో 2వేల కోట్లు నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. ద్రవ్యలోటు భర్తీ కింద 2,803 కోట్లు, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి 700కోట్లు, రాజధాని నిర్మాణం కోసం 2,050 కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 850 కోట్లు విడుదల చేసినట్లు జయంత్ సిన్హా  సమాధానమిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles