పాతాళ భైరవి సినిమాలో నేపాలీ మాంత్రికుడు ఓ సారి ఆదిత్య369లోని టైం మెషీన్ ఎక్కడాట. అలా ఆ మెషీన్ పుణ్యమా అని ప్రస్తుతం మనం ఉంటున్న టైంలోకి వచ్చేశాడు. నేపాలీ మాంత్రికుడు వచ్చీ రాగానే బాహుబలి, రోబోలు కలిశారు. మరి ఈ ముగ్గురి మధ్యన సంభాషణ ఎలా ఉంటుందో చూడండి.
మాంత్రికుడు: ఓయీ. ఎవరు మీరు..? ఏమి రా.. ఇటుల ఉంటిది.. ఓ డింభకా నా మాటకు సమాధానమీయరా..
బాహుబలి: జై మాహిష్మతి. నేను మాహిష్మతికి రాజును ఇక ఇది (అంతలోనే రోబో అందుకుంటాడు)
రోబో: మై నేమ్ ఈజ్ చిట్టి.. స్పీడ్ వన్ టెరా బైట్. బైది బై హూ ఆర్ యు
మాంత్రికుడు: ఓరీ.. డింభకా.. ఏమిరా మాట్లాడుతుంటివి.. నీ మాటలు అర్థము కాకుండున్నవి రా..
రోబో: యు డోంట్ నో ఇంగ్లీష్.. ఓ సరే మీ కోసం తెలుగులోనే మాట్లాడతాను. ఇంతకీ మీ గురించి చెప్పనేలేదు.
మాంత్రికుడు: అతల సుతల పాతాల తలాతల లోకములలో నన్ను మించిన మహా మాంత్రికుడు లేడోయి. నేపాలీ మాంత్రికుడు అంటే ముల్లోకాల్లో తెలియని వాడు లేడు అర్భకులారా..?
బాహుబలి: అవును మాంత్రికుడుగారు మీరు ఎప్పటి వారు.. ఏమిటీ మీ బట్టలు ఇలా ఉన్నాయి
మాంత్రికుడు: నిజానికి నేను రాజుల కాలం నాటి వాడను.. కానీ పాతాళ భైరవి అనే సినిమా ద్వారా 1951లో వచ్చాను.
బాహుబలి: నేను కూడా అంతే చరిత్రలో ఎవరూ నన్ను గుర్తుపెట్టుకోలేదు కానీ రాజమౌళి అనే దర్శకుడు నాకు తిరిగి ప్రాణం పోశాడు
రోబో: నన్ను వసీకర్ తయారు చేశాడు. నాకు మరణం లేదు. మీరంటే అప్పట్లో చాలా భయమట కదా.. మరి మిమ్మల్ని చంపింది ఎవరు
మాంత్రికుడు: ఆ.. ఆ తోట రాముడు.. నా దగ్గర విద్య నేర్చుకొని నన్నే చంపేశాడు.
బాహుబలి: నా పరిస్థితి కూడా అంతే కట్టప్ప అనే నమ్మక ద్రోహి నన్ను చంపేశాడు.
రోబో: హ..హా.. నాన్నా నాకు అలా జరగలేదు. నన్నే నేనే నాశనం చేసుకున్న
మాంత్రికుడు: ఆహా.. ఏమిరా బాహుబలి.. నీవు వెండి తెర మీద కనక వర్షం కురిపించినావట..
బాహుబలి: అవును, మా రాజమౌళి తీసిన విధానం అలా కనక వర్షం కరిపించింది.
రోబో: అహ్హా.. రికార్డులు ఆయన తెచ్చుకున్నాడేమో కానీ నా గురించి మీకు తెలుసా..?
మాంత్రికుడు: నీ గోల ఏమిరా...?
రోబో: శంకర్ అనే మహా దర్శకుడు నన్ను తయారు చేశాడు. నా గురించి దేశం మొత్తం చర్చించింది తెలుసా..?
మాంత్రికుడు: ఓయీ.. అధిక ప్రసంగి.. నా ముందు నువ్వు ఆ చర్చ గురించి మాట్లాడతావా..? నా కాలంలో నేను చేసిన హడావిడి వింటే నీ చెవుల నుండి రక్తం కారుతుందిరా..
రోబో:ఆ అవకాశమే లేదు. ఎందుకంటే నాకు చెవులు లేవు. పైగా రక్తం కూడా లేదు
బాహుబలి: మీరు ఎంతలా మాట్లాడినా నా మీద ఉన్న అంచనాలకు కూడా మీరు సరిపోరు.
మాంత్రికుడు: నిన్ను తయారు చేయడానికి ఆ జిటపుటి మాయాదర్శిని(కంప్యూటర్), ఇంకను ఏమియో వాడినారట కదా.
బాహుబలి: అవును కానీ మీకు ఎక్కడా అలా చేసినట్లు కనిపించవు
రోబో: జిటపుటి మాయాదర్శిని అంటేనే నేను
మాంత్రికుడు: అయినను నేను ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకున్ననూ అద్భుతమైన కళాఖండముగా మారినాను.
బాహుబలి: అవును మీ గురించి విన్నా.. అప్పట్లోనే మీరు చేసిన విన్యాసాల గురించి ఇప్పటికీ మా మాహిష్మతిలో మాట్లాడుకుంటారు.
మాంత్రికుడు: అయిననూ మరి మీ గురించి గొప్పలు చెప్పుకునెదరు ఏలరా.?
రోబో చూడు మాంత్రికుడు గారు.. గతం గతం కానీ నేను ఫ్యూచర్
బాహుబలి: నేను మాహిష్మతి కోసం ఎన్నో చేశాను తెలుసా..?
మాంత్రికుడు ఆపరా అధిక ప్రసంగి... నేను మాయా మంత్రములను పొందుటకు ఎంతటి కష్టం చేశానో తెలుసును రా..?
రోబో: మీ ఇద్దరి హిస్టరీ నా మెమొరీలో ఉంది.
మాంత్రికుడు అయిననూ మీరు డింభకులు.. నా ముందు మీరు అల్పులు
రోబో: ఏంటీ.. డింభకులు, అల్పులు.. ఆమ్లెట్ లు అంటున్నావు.
బాహుబలి: అందరి కన్నా నేను గొప్ప వ్యక్తిని.
మాంత్రికుడు నీ కనక వర్షం చూసుకొని అలా పొగరుబట్టి మాట్లాడుతున్నావు రా.. కానీ అప్పట్లోనే నేను కనక వర్షం అంటే ఏమిటో చూపించితిని. మీరు ఎన్ని చెప్పినను నేను గ్రేట్.
అంతలోనే టైం మెషీన్ మళ్లీ స్టార్ట్ అయింది. మాంత్రికుడు అందులోంచి తిరిగి తన లోకానికి వెళ్లిపోయాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more